Take a fresh look at your lifestyle.

ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతాలు?

బీహార్‌ ‌రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ మధ్య ప్రధాన చర్చనీయాంశం అయ్యాయి.బీహార్‌,‌మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌,‌కర్ణాటక,మణిపూర్‌, ‌తెలంగాణ లాంటి రాష్ట్రాల ఫలితాలు మొత్తంగా మోడీ ప్రజాదరణ తగ్గలేదని, బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పట్టునిలుపుకుందని,ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తుందని స్వష్టం చేస్తున్నాయి.. రాష్ట్రాల వారిగా ప్రత్యేకంగా చర్చిస్తే ఫలితాల సంకేతాలను అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో ప్రత్యేకంగా బీహార్‌ ‌గురించి చర్చించాలి. బీహార్లో ఒక పక్క గత ఆరు సంవత్సరాలుగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని మోడీ,ప్రధాన వ్యూహకర్త పేరొందిన అమీద్షా 15 సంవత్సరాలుగా బీహార్‌ ‌రాష్ట్యాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌,‌జేడీయు, బిజెపి కి బలంగా ఉన్న సంస్థాగత వ్యవస్థలు,దానికి తోడు కేంద్ర ప్రభుత్వం సహకారం.మరో ప్రక్క పోటీలోనే లేదన్న ఆర్జేడీ కూటమి,అందులో ఎటువంటి అనుభవం లేని తేజస్వి యాదవ్‌, ‌జీవన్మరణ సమస్య తో పోరాడుతున్న కాంగ్రెస్‌, ‌వామపక్షాలు.ఇంకోపక్క అధికార పార్టీ వ్యతిరేక ఓటును చీల్చే ఇతర కూటమిలు.. ఫలితాలలో మాత్రం కేవలం మూడంటే మూడు స్థానాలు మాత్రమే మెజార్టీకి ఎక్కువ స్థానాలు గెలుచుకుంది జేడీయు,బిజెపి కూటమి.

కరోన సృష్టించిన కల్లోలం, లాక్డౌన్‌ ‌వల్ల జాతీయ రహదారులపై బీహారీ వలసకార్మికు ల నడకలు, కార్మిక వ్యతిరేక చట్టాలు, నిరుద్యోగం, పేదరికం, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు ,మొదలైనటువంటి ప్రధాన సమస్యల కంటే ఓటర్ల దృష్టిని ఇతర అంశాలే ప్రభావితం చేశాయని చెప్పవచ్చు.ఈ మొత్తం పోరులో వయస్సుకు మించిన పరిణతిని తేజస్వి యాదవ్‌ ‌ప్రదర్శిస్తే,బలానికి తగ్గ ప్రదర్శన కమ్యూనిస్టులు పోషిస్తే,తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కాంగ్రెస్‌ ‌వ్యవహార శైలి ఆర్జేడీ కూటమిని అధికారానికి దూరం చేసింది. సెక్కులర్‌ ‌పార్టీలకు సహకరిస్తామని చెప్పే ఎమ్‌ ఐ ఎమ్‌ ‌మరో జట్టు కట్టి దేశవ్యాప్త మత రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారి పరోక్షంగా బిజెపికి సహకరిస్తుంది.మైనార్టీలు, మెజార్టీలు మతపరంగా రాజకీయాలు చేస్తే లాభపడేది మెజార్టీలే అన్న విషయాన్ని గుర్తించాలి.

మధ్యప్రదేశ్‌ ‌విషయానికి వస్తే పార్టీ ఫిరాయించి ప్రభుత్వాన్ని మార్చిన శాసనసభ్యులకు సైతం ప్రజలు మళ్లీ పట్టం కడుతున్నారంటే కారణాలు ఏమై ఉంటాయి? అభివృద్ధికి ఆకర్షితులైతున్నారా? లేక ధనానికి దాసోహం అవుతున్నారా ? లేక వ్యక్తి పూజను తలకెక్కించుకుంటున్నారా? 11 రాష్ట్రాల్లో 59 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా మధ్యప్రదేశ్‌ ‌లో 28 కి 20,గుజరాత్‌ ‌లో 8 కి 8 ,ఉత్తరప్రదేశ్‌ ‌లో 7 కు 6 ,మణిపూర్‌ ‌లో 5 కు 4, కర్ణాటకలో 2 కు 2 తెలంగాణ లో 1 కి 1కి బిజెపి గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన మెజార్టీ రాష్ట్యాలో మెజార్టీ స్థానాలు బిజెపియే గెలుచుకుంది.ఈ ఉప ఎన్నికల్లో 31 చోట్ల కాంగ్రెస్‌ ఓడిపోతే 41 స్థానాల్లో బిజెపి గెలిచింది. దీన్నిబట్టి చూస్తే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గుతున్నట్లు జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ‌కనుమరుగు అవుతూ బిజెపి ప్రభావం పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా తెలంగాణలో బిజెపి గెలుపు రానున్న జిహెచ్‌ఎం‌సి,ఎమ్మెల్సీ ఎన్నికలపై చివరకు 2023 జనరల్‌ ఎలక్షన్‌ ‌పై ప్రభావం చూపుతుందా? లేక గతంలో మహబూబ్‌ ‌నగర్‌ ఉప ఎన్నిక మాదిరి పాలపొంగేనా? అనే విషయాన్ని భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం.ఎన్నో సంక్షేమ పథకాలు అమలులో ఉన్న టిఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో ప్రజల్లో అసంతృప్తి ఉన్నదనేది వాస్తవం.పరిస్థితులు అనుకూలించాలి కాబట్టే ఆ అసంతృప్తి దుబ్బాకలో బయటపడింది.ప్రజలు కేవలం సంక్షేమపథకాలతోనే సంతృప్తి చెందరని యువతకు ఉద్యోగాలు కల్పించాలని,అన్ని వర్గాలకు సమప్రధాన్యత ఇవ్వాలని, రాజకీయ వ్యవహార శైలిని కూడా గమనిస్తుంటారని గుర్తించాలి. టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు ఓటమిని అంగీకరిస్తామని,కారణాలను అన్వేషించి సరిదిద్దుకుంటామని పేర్కొనడం పరిపక్వ ప్రజాస్వామ్యానికి నిదర్శనం. వారసత్వ రాజకీయాలను ఇంకెంతో కాలం దేశ ప్రజలు అంగీకరించరనే మోడీగారి మాటల్లో వాస్తవం ఉంది.వారసత్వం ఉన్న దానిని అధిగమించి వ్యక్తి సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలని లేదంటే భవిషత్తు ఉండదని స్వష్టం అవుతుంది.

దేశవ్యాప్త ఎన్నికల ఫలితాలు ఒక మిశ్రమ సంకేతాలనిచ్చాయి జంగల్‌ ‌యువరాజ్‌ అనే విమర్శ పట్టించుకోకుండా గత వారసత్వ పాలన తో సంబంధం లేకుండా,ఎంత రెచ్చకొట్టిన వివాదాస్పద వాక్యాలూ చేయకుండా దేశ యువతకు పరిణతి చెందిన ప్రజాస్వామ్య సంకేతాలు పంపాడు తేజస్వి యాదవ్‌.‌నిరుద్యోగం, పేదరికం అనే ప్రధాన సమస్యలతో ఆర్జేడీ కూటమిని ముందుకు నడపడంతో దేశాన్ని ఆకర్షించారు. కరోన కల్లోలం,వలసకులీల కష్టాలు,ఆర్థిక వృద్ధి తిరోగమనం,నిరుద్యోగం,పేదరికం ,కార్మిక వ్యతిరేక చట్టాలు ,రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు లాంటి సమస్యలపై కాశ్మీర్‌ ,‌చైనా , మందిర నిర్మాణం లాంటి భావోద్వేగ అంశాలు పైచేయి సాధించాయి. సంక్షేమ పథకాలతో ప్రజల్లో అసంతృప్తిని ఎంతోకాలం కప్పిపుచ్చలేమని అవగతం అయ్యింది.ధన బలం ,అధికార పార్టీ ప్రభావం ఉప ఎన్నికలపై ఉంటుందని మరోమారు రుజువు అయింది. మైనార్టీ,మెజార్టీ వర్గాలు మత రాజకీయాలు చేస్తే పరోక్షంగా మెజార్టీ వర్గానికె లాభం చేకూరుతుందని స్వష్టం అవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సిద్ధాం తాలు, నాయ కత్వం మారాలని ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.

jurru narayana yadav
జుర్రు నారాయణ యాదవ్‌
‌టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్నగర్‌, 9494019270

Leave a Reply