- ధరల నియంత్రణ, ఫీజుల వసూళ్లపై జీవో ఎందుకు విడుదల చేయరు
- ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసి వెబ్సైట్లో పెట్టాలి
- పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికపై స్పందించిన హైకోర్టు
- న్యాయ వాదులను అడ్డుకోవద్దంటూ డిజిపికి ఆదేశాలు
ప్రైవేటు హాస్పిటల్స్ పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హైకోర్టుకు తెలిపారు. మొదటి దశ కొరోనా సమయంలో ప్రయివేటు హాస్పిటల్స్ నుండి పేషేంట్స్ కు 3 కోట్లు రీ ఫండ్ ఇప్పించామన్నారు. ఈ సారి కూడా ప్రయివేటు హాస్పిటల్ లో వసూలు చేసిన వారికి రీ ఫండ్ ఇప్పిస్తామని అన్నారు. ఒక హాస్పిటల్ 17 లక్షలు బిల్ వేసింది. మేము చర్యలు తీసుకుని మాట్లాడితే 10 లక్షలు పేషంట్ వారికి రిటర్న్ చేశారు అని పేర్కొన్నారు. అయితే ప్రైవేటు హాస్పిటల్స్ లో అధిక ధరలపై ఎందుకు ప్రభుత్వం నియంత్రణ చెయ్యడం లేదన్న హైకోర్టు.. ధరల నియంత్రణ కు ఇప్పుడు ఏమైనా జీవో విడుదల చేసిందా అని ప్రశ్నించింది. దాంతో మొదటి దశలో జీవో విడుదల చేశామని డిహెచ్ పేర్కొన్నారు. అయితే దానిని ఇప్పటికి అమలు చేస్తున్నారా. రెండవ దశ కొరోనా సమయంలో ఎందుకు జీవో విడుదల చేయలేదు హైకోర్టు ప్రశ్నించింది. ధరల నియంత్రణ, అధిక ఫీజుల జీవో ఏర్పాటు పై మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హెల్త్ డైరెక్టర్ అన్నారు. ఈ ధరల నియంత్రణ పై ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసి వెబ్సైట్ లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలో కొరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగింది.
విచారణలో భాగంగా బుధవారం థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్ హైకోర్టుకు తెలిపారు. కాగా హాస్పిటల్స్ల్లో అధిక ఫీజులపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. ప్రైవేట్ హాస్పిటల్స్•• ఇప్పటివరకు 174 ఫిర్యాదులొచ్చాయని డీహెచ్ తెలిపారు. వాటిలో 113 ప్రైవేట్ హాస్పిటల్స్‌కు నోటిసులిచ్చామని, 20 హాస్పిటల్స్ లైసెన్స్‌లు రద్దు చేశామన్నారు. ఆర్టీపీసీ టెస్టుల కోసం 6 ల్యాబ్ ఏర్పాటు చేశామని, మిగితా 8 ల్యాబ్స్‌ను జూన్ 10 వరకు సిద్ధం చేస్తామని డీహెచ్ హైకోర్టుకు తెలియజేశారు. మూడో దశ కొరోనా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుంది అనడానికి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు.
ప్రైవేటు హాస్పిటల్స్ లైసెన్స్ రెన్యూవల్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటేనే లైసెన్స్‌లను రెన్యూవల్ చేస్తామన్నారు. ప్రభుత్వం పాశ మైలారంలో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తయారు చేస్తుందన్నారు. ఇకపోతే లాక్డౌన్ వేళ న్యాయవాదులను అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదులు, క్లర్క్‌లు, స్టెనోలను అనుమతించాలని కోర్టు ఆదేశించింది. బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతించాలని సూచించింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి న్యాయవాదుల రాకపోకలు అడ్డుకోవద్దని కోర్టు ఆదేశించింది. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ మహేందర్‌రెడ్డికి హైకోర్టు ఆదేశించింది. ఐడీ కార్డు చూపినా లాయర్లను అవమానిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది.