మహిళా సంఘాల సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు..
హైరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో ఇద్దరు మహిళలపై ఆత్యాచారం జరిగిందన్న వార్త వొచ్చిన నేపథ్యంలో నిజ నిర్ధారణ కోసం అక్కడికి వెళ్ళిన మహిళా – ట్రాన్స్ జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులైన పీఓడబ్ల్యు సంధ్య, రచయిత్రి బండారు విజయ, ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మి, చైతన్య మహిళా సంఘం నేత జ్యోతి, ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ నేత కృష్ణకుమారిలను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు.
మధ్యాహ్నం తర్వాత మహిళా సంఘాల జేఏసీ సభ్యులను పోలీసులు వదిలిపెట్టారు. వారు మరికొంతమంది సభ్యులను కలుపుకుని మళ్లీ గాంధీ హాస్పిటల్కి వెళ్లి సూపరిండెంట్తో మాట్లాడి ఫాక్ట్ ఫైండింగ్ కొనసాగించారు.