లాక్ డౌన్ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదని 32, 38వ డివిజన్లలో బుధవారం నిత్యావసర వస్తువుల పంపిణీ చేసినట్లు ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటి నుండి అనునిత్యం ప్రజలలో ఉంటూ వారికి కావలసిన నిత్యావసర వస్తువులను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం సడలింపు ఇస్తుంది కాదా అని అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి వైరస్ భారీన పడకూడదన్నారు. వైరస్ కట్టడికి సిఎం కెసిఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. విపత్కర సమయంలో నిరుపేదలకు అండగా నిలవాలనే సంకల్పంతో పశ్చిమ నియెజకవర్గంలో ప్రతి నిరుపేద ఇంటికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామన్నారు. 32వ డివిజన్ న్యూ శాయంపేటలో 1000 మంది నిరుపేద కుటుంబాలకు, 38వ డివిజన్ విష్ణుప్రియ గార్డెన్లో 1850 మంది నిరుపేదలకు సరుకులు అందజేమన్నారు.
వలస కూలీలను స్వస్థలాలకు పంపిస్తున్నాం
సిఎం కెసిఆర్ నిరుపేదల పక్షపాతీగా లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నా నిరుపేదలకు, వలస కూలీలకు 12కిలోలు బియ్యం రూ.1500 అందజేమన్నారు. కరోనా వైరస్ కట్టడికీ స్వీయ నిర్భంధనా ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరన్ని, పరిశుభ్రతను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పోరేటర్ అరుణా శివశంకర్, డివిజన్ ప్రెసిడెంట్ వెంకన్న, వేణు, సదానందం, నాగరాజు, శ్రీదర్, డివిజన్ నాయకులు నిరుపేదలు పాల్గొన్నారు.