Take a fresh look at your lifestyle.

‘వెల్ డన్ వెన్నెల..’

* ఫారెస్ట్ పీజీ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో బక్రీ చెప్యాల విద్యార్థినికి 9వ ర్యాంకు
* వారణసిలోని ప్రసిద్ధ బెనారస్ హిందూ యూనివర్సిటీలో సీటు పొందిన వెన్నెల
* సిద్దిపేట జిల్లా నుండి మొట్టమొదటి విద్యార్థిని
* శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు  
సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామానికి చెందిన పురుమాండ్ల కొండల్ రెడ్డి- రేవతి దంపతుల పెద్ద కూతురు వెన్నెల రెడ్డి ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో ఇటీవల బీఎస్సి డిగ్రీ పూర్తి చేసింది. ఎమ్మెస్సి ఫారెస్ట్ ఉన్నత విద్య కోసం గత ఆగస్టు 27న ఎంట్రన్స్ పరీక్ష రాసింది. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశంలోనే 9వ ర్యాంకు సాధించింది. ఎంతో మంది విద్యావంతులను తీర్చిద్ధిద్దిన బెనారస్ యూనివర్సిటీలో సీటు దక్కించుకుంది. ఈ కోర్సులో  ప్రవేశం పొందిన మొట్ట మొదటి విద్యార్థినిగా  సిద్దిపేట జిల్లా ఖ్యాతిని వెన్నెల చాటింది. మంచి ర్యాంకు సాధించిన వెన్నెలను ఫోన్ లో మాట్లాడిన మంత్రి హరీష్ రావు  ప్రత్యేకంగా అభినందించారు. అరుదైన కోర్సులో చేర్పించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు కొండల్ రెడ్డి, రేవతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఊరి ఆడబిడ్డ సాధించిన విజయంపై బక్రీ చెప్యాల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply