Take a fresh look at your lifestyle.

మనస్పూర్తిగా స్వాగతిస్తున్నా.. : ఎల్‌కె అద్వానీ

ఇది నాకు శుభవార్త..బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని బిజెపి సీనియర్‌ ‌నేత ఎల్‌కె అద్వానీ అన్నారు. ఈ తీర్పు రామజన్మ భూమి ఉద్యమం పట్ల తన నిబద్ధతతో పాటు బీజేపీ చిత్తశుద్ధిని తెలియ జేస్తుందని అద్వానీ పేర్కొన్నారు.

కుట్ర జరుగలేదని నిర్ధారణ అయ్యింది : మురళీ మనోహర్‌ ‌జోషి
కోర్టు చరిత్రాత్మక తీర్పును ఇచ్చినట్లు బీజేపీ సీనియర్‌ ‌నేత మురళీ మనోహర్‌ ‌జోషి చెప్పారు. అయోధ్యలో 1992 డిసెంబర్‌ 6‌వ తేదీన ఎటువంటి కుట్ర జరగలేదని ఈ తీర్పుతో నిర్దారణ అయినట్లు ఆయన వెల్లడించారు. తాము నిర్వహించిన కార్యక్రమాలు, ర్యాలీల్లో ఎటువంటి కుట్ర లేదన్నారు. కోర్టు తీర్పు సంతోషాన్నిచ్చిందని, రామ మందిర నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నట్లు జోషి తెలిపారు. అన్ని అంశాలను కోర్టు పరిశీలించడం సంతోషంగా ఉందన్నారు. కేవలం రామ మందిర నిర్మాణం కోసమే తమ ఉద్యమం సాగినట్లు జోషి తెలిపారు.

Leave a Reply