Take a fresh look at your lifestyle.

‌కెసిఆర్‌ ‌దృష్టిలో వీకెండ్‌ ‌లాక్‌డౌన్‌

రాష్ట్రంలో కంట్రోల్‌లోనే కొరోనా
లాక్‌డౌన్‌తో పేదల ఉపాధికి దెబ్బ
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువే
మందుల, బెడ్లు, ఆక్సిజన్‌ ‌కొరత లేదు: సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌
తెలంగాణలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ ఉం‌డదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

సోమేశ్‌ ‌కుమార్‌ ‌పేర్కొన్నారు. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్‌ ‌లాక్‌డౌన్‌ అం‌శాన్ని పరిశీలిస్తామని సీఎస్‌ ‌స్పష్టం చేశారు. పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అవసరమైనప్పుడు సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. లాక్‌డౌన్‌ ‌విధించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నారు. ఢిల్లీలో లాక్‌డౌన్‌ ‌కారణంగానే రాష్ట్రానికి టెస్టింగ్‌ ‌కిట్లు రావడం లేదని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ‌కంటే మంచి చికిత్సను అందించడం ముఖ్యమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కెసిఆర్‌ ‌దృష్టిలో వీకెండ్‌ ‌లాక్‌డౌన్‌ ‌పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. లాక్‌డౌన్‌ ‌వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతింటుంది. ఆ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక అవసరాలు, అక్కడి పరిస్థితులను బట్టి పొరుగు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ‌పెట్టుకున్నాయని సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌పేర్కొన్నారు.తెలంగాణలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తిని కంట్రోల్‌ ‌చేస్తున్నామని సోమేశ్‌ ‌కుమార్‌ ‌స్పష్టం చేశారు. కొరోనాపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సవి•క్షిస్తున్నారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువగా ఉంది అని పేర్కొన్నారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో సీఎస్‌ ‌వి•డియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మందులు, ఆక్సిజన్‌తో పాటు నిత్యావసరాల కొరత లేదు. ప్రస్తుతం 62 వేల ఆక్సిజన్‌ ‌బెడ్లు ఉన్నాయి. ఇంకా ఆక్సిజన్‌ ‌బెడ్స్ ‌పెంచాలని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్‌, ‌బెడ్ల కొరత లేకుండా చూస్తున్నాం. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అడిట్‌ ‌చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ మెరుగైన వైద్యం అందడం వల్లే ఇతర రాష్ట్రాల రోగులు వస్తున్నారు. ఆస్పత్రుల్లో ఇతర రాష్ట్రాల రోగులే అధికంగా ఉన్నారని తెలిపారు. వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. కరోనా వ్యాప్తి నివారణకు వైద్యారోగ్య సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిపారు. ఒడిశా నుంచి ఒక ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌ ‌రావాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతోంది. ఎయిర్‌లిప్ట్ ‌చేయడం వల్ల మూడు రోజుల సమయం ఆదా అవుతోంది. రాష్‌ర్టానికి రోజుకు 125 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌సరఫరా సామర్థ్యం ఉందన్నారు.

కర్ణాటక, తమిళనాడు నుంచి రావాల్సిన 45 టన్నుల ఆక్సిజన్‌ ‌రావట్లేదు. ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్‌ ‌టెస్టులు చేసేందుకు సౌకర్యం కల్పిస్తామన్నారు. కొరోనా నియంత్రణకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేయమని సీఎం చెప్పారు అని సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌‌వెల్లడించారు.

Leave a Reply