Take a fresh look at your lifestyle.

అల్పపీడనం, నైరుతి ప్రభావం..

  • వొచ్చే ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
  • ఎగువన వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టుల్లోకి నీరొస్తుందన్న వాతావరణ శాఖ
  • శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు

అల్పపీడనం, నైరుతి ప్రభావంతో వొచ్చే ఐదురోజులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ అధికారులు అన్నారు. ఎగువప్రాంతాల్లో వర్షాలు కురిస్తేనే కృష్ణా, గోదావరిల్లో నీళ్లు వొస్తాయని అన్నారు. ఇక అటు జోరువానలకు ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతున్నది. నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలయింది. వర్షాలు ఇలాగే కొనసాగితే గోదావరినదికి వరద ప్రవాహం పెరిగే సూచనలున్నాయని అధికారులు అంటున్నారు. హైదరాబాద్‌లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. అటు నైరుతి రుతుపవనాలు తెలంగాణ వైపు చురుకుగా కదులుతున్నట్టు తెలిపారు. ఇక ఆవర్తన మార్పులతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో అత్యధికంగా వర్షం కురిసింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో వొచ్చే రెండురోజులు రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, ‌నిజామాబాద్‌ ‌పాత జిల్లాల పరిధిలో కొన్నిచోట్ల భారీ వానలు పడనున్నాయి. నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో 67 వేల క్యూసెక్కుల వరద గోదావరి నదిలోకి ప్రవహిస్తుంది. దీనికి తోడుగా ఆదివారం కురిసిన భారీ వర్షాలకు గోదావరికి అదనంగా 10వేల క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 37.37 టీఎంసీల నీళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Leave a Reply