Take a fresh look at your lifestyle.

పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది. ఈ మేరకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్‌, ‌రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, ములుగు, భదాద్రి, కొత్తగూడెం, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్.. ‌ఖమ్మం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ‌జారీ చేసింది. పలుచోట్ల గంటకు 30-40 కిలోవి•టర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్‌, ‌హన్మకొండ, వరంగల్‌, ‌జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్ ‌జారీ చేసింది. నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో.. గంటకు 30-40 కిలోవి•టర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాఖ వివరించింది.

Leave a Reply