Take a fresh look at your lifestyle.

ప్లాస్టిక్‌ మాస్క్‌ కాదు…బట్ట మాస్క్  ధరించాలి..: మంత్రి హరీష్‌ రావు

కొరోనా నేపథ్యంలో వాడుతున్న ప్లాస్టిక్‌ మాస్కుతో పర్యావరణానికి ఆటంకం ఏర్పడుతుందని, ప్లాస్టిక్‌ మాస్కు వద్దు.. బట్ట మాస్కులే వాడాని మంత్రి తన్నీరు హరీష్ ‌రావు సూచించారు. ఈ మేరకు మున్సిపల్‌ కార్మికులకు బట్ట మాస్కులు  మంత్రి హరీశ్‌ రావు పంపిణీ చేసి మాట్లాడారు.  కొరోనా నుండి  సిద్దిపేట సేఫ్‌ చేసుకున్నాం, ప్రజ చైతన్యం, స్ఫూర్తితో సాధ్యమైందన్నారు. మన రక్షణ మన చేతుల్లో ఉందని ప్రతి ఒక్కరు  మాస్క్‌ ను ధరించాలన్నారు. అదే విధంగా ప్రతి రోజు మూడు సార్లు సబ్బుతో చేతులు  శుభ్రంగా కడ్డుకోని, సానిటీజేషన్‌ చేసుకోవాలన్నారు. అయితే మనం వాడే మాస్క్‌ పర్యావరణాన్ని ఆటంకం కలిగించకుండా  ఉండేలా బట్ట మాస్క్‌ ధరించాలని మంత్రి హరీష్‌రావు సూచించారు .

Leave a Reply