Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌కు వెన్నుదన్నుగా గ్రేటర్‌ ‌లో నిర్ణయాత్మక పాత్ర పోషించిన బలహీన వర్గాలు.! టిఆర్‌ఎస్‌ ‌కే మేయర్‌ ‌పీఠం..!!

గ్రేటర్‌ ‌హైదా రాబాద్‌ ‌కార్పోరేషన్‌ ఎన్నికల్లో గత ఎన్నికలకు  పోల్చు కుంటే ఓటింగ్‌ ‌శాతం పెరుగడం, ఏన్నికల కమీషన్‌, ‌పాలకపక్షం చేపట్టిన ప్రచారంలో బాగంగానే ఓటర్లు రెట్టింపు విశ్వాసంతో వమ్ముచేయకుండా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంబమయిన పోలింగ్‌ ‌మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 12% పోల్‌ ‌కావడం , ఎన్నికల కమీషన్‌ ‌నైరాశ్యంతో , ఆశేష ప్రజానీకం ఉత్కంట  భరితంగా 20-20 క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌లా టీవీలకు అంటి బెట్టుకొని  సమీక్షలు చూస్తూ, నిరాశ, నిస్పృహలతో అన్ని పార్టీలు వేచిచూడడం 3గంటల వరకు 30% పోల్‌ ‌కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఓటింగ్‌ ‌నమోదు పుంజుకోవడంతో  గతంలో 2010 ఎన్నికల్లో 42.92%, 2016లో 45.29%  లో వరుసగా నమోదైన పోలింగ్‌ ,2020 ‌లో మాత్రం 46.55% కావడం, గడిచిన 20 సంవత్సరాలలో ఏక్కువగా నమోదు కావడం ఇదే మొదటి సారి, దీనికి ఎన్నికల కమీషన్‌ ‌పై , అధికార పార్టీ పై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలకు చెన్నై, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ మహానగరం కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా గరిష్టంగా 60 శాతానికి మించి ఏప్పుడు ఓటింగ్‌ ‌శాతం నమోదు కాలేద నే విషయం తెలియదా? ప్రజాస్వామ్య దేశంలో ఓటింగ్‌ ‌శాతం తగ్గడం 1945 నుంచి ప్రారంభమై 1980 మధ్య బాగా దిగజారింది. మన పార్లమెంట్‌ ఎన్నికల్లో  ఓటింగ్‌ ‌శాతం అధికంగా ఉంటుందని పట్టణ ప్రజల కంటే పల్లె ప్రజలు చురుగ్గా పాల్గొంటారని విశ్లేషకులు బావిస్తున్నారు.

భారీగా తగ్గి, పెరిగిన పోలింగ్‌..
‌హైదరాబాద్‌ ‌మహానగరంలో ఎన్నికలు ఏవైనా పోలింగ్‌ ‌శాతం50కి మించి నమోదైన సందర్భాలు చాలా అరుదు. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో ఓవరాల్‌ ‌గా 45.29 శాతం పోలింగ్‌ ‌నమోదైంది. 2014 హైదరాబాద్‌ ఎన్నికలలో నమోదైన 52.99 శాతంలో. అదే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ వ్యాప్తంగా 50.86 శాతం, 2019 లోక్‌ ‌సభ ఎన్నికల్లో 45.51 శాతం పోలింగ్‌ ‌నమోదైంది. ఈసారి కరోనా భయాలు, వరుస సెలవులు, వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌తదితర కారణాలతో  తగ్గిందని బావించారు .మంగ ళవారం సాయంత్రం 5 గంటలకు 40 శాతానికి కూడా చేరడం వలన ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్‌ ‌పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయి లెక్కల బుధవారం ఉదయానికి అందుబాటులోకి రావడంతో మహానగరంలో జరిగిన ఎన్నికల్లో  గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగిన పోలింగ్‌ ఏక్కువనే అని విశ్లేషకులు బావిస్తున్నారు. అతి తక్కువ పోలీంగ్‌ 96 ‌వ డివిజన్‌ ‌యూసఫ్‌ ‌గూడలో కేవలం 32.99  కావడం.112వ, డివిజన్‌ ‌లో 67.71 అతి ఏక్కువ పోలింగ్‌ ‌తో రికార్డ్ ‌బ్రేక్‌ ‌చేసింది. మొత్తం 149 డివిజన్‌ ‌లలో 45% లోపు 49 డివిజన్లు ఉండగా 45% నుండి 60% లొపు 97 డివిజన్‌ ‌లలో పోలింగ్‌ ‌నమోద్‌ ‌కాగా 3 డివిజన్లలో మాత్రం 60% పైగా నమోదు చేసి 20 సంవత్సరాల చరిత్రను బ్రేక్‌ ‌చేసినారని , 101 డివిజన్లలో టిఆర్‌ఎస్‌ ‌శాశ్వత ఓటుబాంకు  ఉండడం మూలంగానే ఓటింగ్‌ ‌శాతం పెరిగిందనేది జగమెరిగిన సత్యం. వాయిదా పడ్డఓల్డ్‌మల్లక్‌ ‌పేట పోలింగ్‌ ‌గురువారం ప్రశాంతంగా జరుగడంతో ఎన్నికల కమీషన్‌ ఊపిరి పీల్చుకుంది. ప్రభుత్వం చేపట్టిన బిసీల సంక్షేమ పథకాలు ముగ్దులైనా బలహీనవర్గాలు ఏకపక్షంగా నిలిచినారనేది పోలింగ్‌ ‌సరళి చూస్తే అర్థం అవుతుంది.కేటీఆర్‌, అన్నితానై చేసిన అభివృద్ది ప్రఛారం సెంచరి దిశగా పలితాలు రావడం ఖాయంగా విశ్లేషకులు బావిస్తున్నారు.

కేసీఆర్‌ ,‌బీసీల పక్షపాతిగా..
సి.యం.కేసీఆర్‌ ‌గ్రామీణ కుల వృత్తులకు వెన్న దన్నుగా నిలబడటం, ఆవృత్తులు పూర్వవైభ వాన్నిసంతరించు కోవడానికి, వృత్తుల ఆధారంగా జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి వృత్తి  పని వారలకు అండగా, నిలబడే విధానాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగు తున్నది. తెలంగాణ సంస్కృతి గురించి క్షుణ్ణంగా తెలిసిన నాయకుడు కేసీఆర్‌ ‌ప్రభుత్వం అధికారంలోఉండటం వల్లనే సాద్యమైంది. గ్రామీణ జీవన సౌందర్యాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లే విధంగా విధానాలు, వ్యూహాలు, ప్రణాళికల రూపకల్పనతో ఇప్పుడు రాష్ట్రం దేశానికే ఆదర్శంగా, నిలిచింది. కుల వృత్తులకు చేయూత నివ్వడమంటే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడమే అవుతుంది. ఎందుకంటే బీసీకులాలు ప్రధానంగా వృత్తి ఆధారిత కులాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. బిసీలను సామా జికంగా ఏదిగేందుకు కృషి చేసింది కేసీఆర్‌ అనడంలో అతిశయోక్తి లేదు., ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు బడుగులకు ఏక్కువగా ఉపయోగ పడుచున్నాయని, బిసీలకోసం పరితపించే టిఆర్‌ఎస్‌ ‌కోసం బ్రతికినంత కాలం బడుగు బలహీన వర్గాలు  కేసీఆర్‌ ‌వెంటే నడు స్తారని, తెలంగాణ ప్రభుత్వం ఆరు సంవత్సరాలు  పాలనలో బీసీల కోసం 26,900 కోట్లు కేటాయించారని, ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు 18 సంవత్సరాలలో 16200 కోట్లు కేటాయించిన సంగతి విధితమే.వెనుకబడిన కులాలలో కూడా ఎస్సీ ఎస్టీల కన్నా అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుతున్నటువంటి, అడ్రస్‌ ‌లేనటువంటి 17 సంచార కులాలకు చట్టబద్ధత కల్పించి సాకారం చేశారని అందుకోసం బిసీలు కేసీఆర్‌ ‌ను గుండేల్లో పెట్టుకుంటారనేది  నిర్వివాదాంశం.

బిసీలకు వెన్నుదన్నుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీలకు మహర్దశ వచ్చిందనే చెప్పాలి, ఉద్యమంలో సబ్బండ వర్ణాలు కెసిఆర్‌ ‌వెంటే ఉండి సకల జనుల సమ్మెలో తెలంగాణ రాష్ట్ర సమితి కి  మద్దతుగా నిలిచిన, బిసీ,వర్గాలకు ఉమ్మడి రాష్ట్రంలో  19 గురుకులాలు మాత్రమే వుండేవి, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 262 ఏర్పాటు చేసి,  స్కూల్స్, ‌జూనియర్‌ ,‌డిగ్రీ కళాశాలను బలోపితం చేసి,గురుకులాలను ఏర్పాటు చేసి బీసీలకు పెద్దదిక్కుగా,ఒక మార్గదర్శకులుగా నిలిచి, కార్పోరేట్‌ ‌విద్యకు దీటుగా  చదువును అందించి  పేదలపాలిట,బడుగుల గుండెల్లో పది కాలాలపాటు చిరకాలంగా నిలిచినారు.ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కుల సంఘాలను గౌరవించినదాఖలాలు లేవు,కేసీఆర్‌ ‌నాయ కత్వంలో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలకు స్థలాన్ని, దాదాపు 100 కోట్ల నిధులు కేటాయించి బీసీల పక్షపాతిగా నిలిచినారు. గ్రామీణ జీవన సౌందర్యాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లే విధంగా విధానాలు, వ్యూహాలు, ప్రణాళికల రూపకల్పనతో ఇప్పుడు రాష్ట్రం దేశానికే ఆదర్శంగా, నిలిచింది. కుల వృత్తులకు చేయూత నివ్వడమంటే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడమే అవుతుంది. ఎందుకంటే బీసీకులాలు ప్రధానంగా వృత్తి ఆధారిత కులాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. బిసీలు ఆత్మ గౌరవం నిలబెట్టిన, కేసీఆర్‌ ‌పై   అభిమానం తో 2020 ఎన్నికల్లో  అండగా నిలిచినారనేది జగమెరిగిన సత్యం.

బిసీలు  నిర్ణయాత్మకంగా..
గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌ఫలితాల్లో బీసీల ఓట్లు నిర్ణయాత్మకంగా మారనుంది.150 డివిజన్‌ ‌లు ఉండగా అందులో 75 డివిజన్‌ ‌లలో బిసీలు నిర్ణయాత్మక శక్తిగా మారినారు. వారి బలాన్ని ఆకర్షించేందుకు వివిధ పార్టీల ఎత్తుగడలు, ,బహురూపాలు ,ప్రదర్శనలు, ప్రగల్భాలు. ఆకట్టుకోలేక పోయినారు. కారణం కూడా లేకపోలేదు.ఎన్నికల్లో యాదవ, మున్ను రుకాపు, గౌడ, ముదిరాజ్‌ ‌లకు  సింహ బాగంలో టికెట్స్ ‌కేటాయించారు. బీసీలకు 33 శాతంరిజర్వేషన్‌ ఉన్నప్పటికీ, పలుచోట్ల జనరల్‌ ‌స్థానాల్లో సైతం బీసీలకు టికెట్లు కేటాయించడం. బీసీ కులాలు అనేక డివిజన్లలో గెలుపు ,ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.అయితే టిఆరెస్‌ ‌పార్టీలలో మాత్రం గెలుపు గుఱ్ఱాల కే పెద్ద పీట వేసినారని, అభ్యర్తుల అర్హతల్లో బలమైన సామాజికవర్గం, వ్యక్తిగత ప్రతిష్ట, ఆర్థిక స్థోమత ,మానవసంబంధాలు, నిత్యం ప్రజలకొసం తపించే వ్యక్తి,  ప్రజలమధ్య ఉండి ఎలాగైనా గెలవాలనే కసి, ఉన్నవారికి, పార్టీలో గుర్తింపు ఇచ్చి గెలుపుకు బాటలు వేసినారని, పార్టీలో టికెట్‌ ‌దొరకని,టికెట్‌ ఇవ్వని వారికి  సేవలు గుర్తించి, ప్రభుత్వంలో ఏదైనా పాలన పదవులల్లో అవకాశాలు కల్పిస్తామనే భరోసా తో పార్టీ గెలుపుకోసం కృషి చేసినారని ,దానికి సజీవ సాక్ష్యం ఓటింగ్‌ ‌సరళి పెరగడమే  సెంచరీ ఖాయంగా బావిస్తున్నారు.

టికేట్‌ ఆశించిన ఆశవహులందరు కూడా భవిష్యత్త్ ‌లో వివిధ పదవులలో నామినేట్‌ ‌చేస్తారనే ఆశతో గెలుపు గుఱ్ఱాలకు మద్దతు ఇవ్వడం తప్పని పరిస్థితి అయ్యింది. బీ సీలకు అండగా నిలిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలనే  దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సమితి కి మద్దతుగా నిలిచినారనేది నిర్వివాదం.

అపహాస్యం చేస్తున్న విద్యావంతులు
గ్రేటర్‌ ‌పోలింగ్‌ ‌కు సంబంధించి  ఏన్నికల యంత్రాంగం, పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపే ముందు ఓటర్ల నిరాసక్తతను కూడా ప్రశ్నించాల్సిందేనని నెట్టింట చర్చ జరుగుతోంది. ఐటీ ప్రొఫెషన్స్ ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పట్టుమని 40% శాతమైనా నమోదుకాకపోవడం ప్రజాస్వామికవాదుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సందర్భంగా నిర్బంధ ఓటింగ్‌ ‌విధానంపై చర్చ జోరందుకుంది. అర్హత కలిగిన ఓటర్లందరూ పోలింగ్‌ ‌డే నాడు తప్పనిసరిగా ఓటేసేలా, ఒకవేళ ఓటేయకుంటే వారిపై చర్యలు తీసుకునే విధానం వస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాబోదని నెటిజన్లు అంటున్నారు. సోషల్‌ ‌మీడియాలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసే ఓటర్లు ఓటేసేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారని ఇంకొందరు మండిపడ్డారు.

నిర్భంద ఓటింగ్‌ ‌సాధ్యంఅవుతుందా..
అప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ‌ఖురేషీ తప్పుపట్టారు. అధిక జనాభా ఉన్న ఇండియాలో నిర్బంధ ఓటింగ్‌ ‌విధానాన్ని అమలు చేయలేమని, ప్రజాస్వామ్యం, నిర్బంధం చెట్టపట్టాలేసుకుని సాగలేవని ఖురేషీ వ్యాఖ్యానించారు. ఓటింగ్‌ ‌శాతం పెరిగేందుకు ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు కృషి చేయడమే తప్ప నిర్బంధ ఓటింగ్‌ ఇప్పట్లో సాధ్యమయ్యే వ్యవహారం కాదని ఖురేషీ అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు రిజర్వేషన్లు పోలింగ్‌ ‌కేంద్రాల ఏర్పాటు మొదలైనవి సంస్థాగత కారణాలు నిరాసక్తత ఓటింగ్‌ ‌నేను ఓటు వేయడం అంత మాత్రాన పెద్ద ప్రభావం ఉండదు వ్యక్తిగత కారణాలు నగరాల్లో ఓటింగ్‌ ‌శాతం తక్కువగా ఉండడానికి సంస్థాగత కారణాల కంటే వ్యక్తిగత కారణాల ప్రధానం ఈ పరిస్థితిని చక్కదిద్ది నగరాల్లో ప్రజాస్వామ్యం ఇస్తుంది.ప్రపంచీకరణ ప్రభావం ప్రైవేట్‌ ‌కార్పొరేట్‌ ‌సంస్థల ద్వారా పౌర సేవలు అందించే ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భవించడం తో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య దూరం పెరిగింది ప్రభుత్వ ఏర్పాటు కొన్ని వర్గాలకే పరిమితమైన క్రీడగా భావించి వాటి పట్ల వ్యతిరేకత పెంచుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుచున్నారు.
డా।। సంగని మల్లేశ్వర్‌
‌జర్నలిజం విభాగాధిపతి, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌,  9866255355

Leave a Reply