
వనపర్తి మున్సిపాలిటిలోని 7వ వార్డులో పీర్ల డుట్ట ప్రాంతంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరం•న్ రెడ్డి పల్లె నిద్రలో భాగంగా కాలనీలలోని 7వ వార్డు కౌన్సిలర్ నక్కా రాములు యాదవ్ కాలనీలలోని సమస్యలను మంత్రి నింజన్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వార్డులల్లో తిరిగి పలు సమస్యల పై ప్రజలతో కలిసి మంత్రి అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో నెలకొన్న వాటర్ లీకేజి ఉండడంతో రెండు రోజుల్లో పూర్తి చేయాలని మున్సిపల్ డిఈ సందీప్ వరల్డ్ ను మంత్రి ఆదేశించారు.
నూతన విద్యుత్ స్థంబాలను వేయాలని అవసరమయితే ఎస్సీ తో మాట్లాడి తీసుకొస్తానని ఏఈ రాజాగౌడ్కు చెప్పారు. అవసరయిన చోట మంచినీటి బోర్లు సిసి రోడ్లను పీర్లగుట్ట వాటర్ ట్యాంకు దగ్గర ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రం మహిళా భవనం, చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయాలని ఇందుకోసం ప్రణాళికలు తయారు చేసి ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ గట్టుయాదవ్, వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ, పాకనాటి క్రిష్ణ, బండారు క్రిష్ణ, చీర్ల సత్యం సాగర్, జంపన్న యాదవ్, కంచ రవి, నాగన్న యాదవ్, నందిమల్ల శ్యామ్ కుమార్, తిరుమల్, గోపాల్యాదవ్, రహీమ్, వెంకటేష్, యాదవ్ తదితరులు పాల్గొన్నారు.