Take a fresh look at your lifestyle.

న్యూజిలాండ్‌తో కలిసి పనిచేస్తాం: పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు

New Zealand Parliamentary Secretary radha krishnan who met Minister KTRప్రజాతంత్ర, హైదరాబాద్‌: ‌న్యూజిలాండ్‌ ‌దేశ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. న్యూజిలాండ్‌ ఎత్నిక్‌ అఫైర్స్ ‌శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధక్రిష్టన్‌ (‌పార్లమెంట్‌ ‌సబ్యురాలు) బుధవారం మంత్రి కెటి రామరావును ప్రగతి భవన్‌ ‌లో కలిసారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక, విద్యారంగాల్లో కలసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించారు. స్ధానిక రాజకీయ వ్యవస్ధల పనితీరుపైన ఇరువురు చర్చించారు. తెలంగాణతో అగ్రిటెక్‌, ఇన్నోవేషన్‌, ‌స్టార్ట్ అప్‌ ‌రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించారు. ఈసందర్భంగా తెలంగాణలో ఉన్న పరిస్ధితులను మంత్రి కెటిఆర్‌, ‌ప్రియాంకకు వివరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ అప్‌, ఇన్నోవేషన్‌ ‌రంగంలో దేశంలోనే ముందువరుసలో ఉన్నదని, టిహబ్‌, ‌విహబ్‌ ‌వంటి ఇంక్యూబేటర్ల ద్వారా ఈ రంగంలో ముందున్నామన్నారు. దీంతోపాటు త్వరలోనే టి హబ్‌ ‌రెండో దశ ప్రారంభం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేషన్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేయనున్నామని, ప్రస్తుతం ఉన్న వీదేశీ స్టార్ట్ అప్‌ ఇకో సిస్టంతో కలిసి పనిచేసేందకు ఉద్దేశించిన టి- బ్రిడ్జ్ ‌కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నామని తెలిపారు. టి బ్రిడ్జ్ ‌కార్యక్రమంలో భాగంగా న్యూజిలాండ్‌ ‌స్టార్ట్ అప్స్ ‌తోనూ కలిసి పనిచేసేందుకు కృషి చేయాలన్నారు.

దీంతోపాటు అగ్రిటెక్‌ ‌రంగంలోనూ అనేక అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా పెద్దఎత్తున అందుబాటులోకి వస్తున్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగంలో, పుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, ఇప్పటికే ఇక్రిసాట్‌ ‌తో అగ్రిటెక్‌ ‌రంగంలో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. దీంతోపాటు న్యూజిలాండ్‌ ‌ప్రధాని జస్సిండా అర్డన్‌ అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నారని, అమె నాయకత్వం పట్ల మంత్రి కెటిఆర్‌ ‌ప్రసంశలు కురింపించారు. ప్రధానిని కలిసేందుకు తాను సమావేశం ఏర్పాటు చేస్తానని, న్యూజిలాండ్‌లో పర్యటించాల్సిందిగా ప్రియాంక, కెటిఆర్‌ ‌ను కోరారు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రియాంక తెలిపారు. సమావేశంలో ఏన్నారై టీఆర్‌ఎస్‌ ‌కో అర్డినేటర్‌ ‌మహేశ్‌ ‌బిగాల ఉన్నారు.

Tags: Parliamentary Secretary,New Zealand, Ethnic Affairs, Department, Industry Minister, K Taraka Rama Rao

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!