Take a fresh look at your lifestyle.

ఎపిలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి తోడ్పాటు
పేదలకు ఫలాలు అందాలన్నదే తమ విధానం
ఎపి బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు

విజయవాడ,ఆగస్ట్ 11 : ‌వచ్చే  2024లో జరిగే ఎన్నికల ద్వారా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతామని, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అందుకు తగు విధంగా కార్యాచరణ చేస్తామని అన్నారు. బిజెపి లక్ష్యాలే తమ అధికారానికి సోపానాలని అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టగా ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ఆ పార్టీ నేతలు రాంమాధవ్‌, ‌సతీష్‌ ‌జీ.. సునీల్‌ ‌దేవధర్‌, ‌కన్నా లక్ష్మినారాయణ, పురంధేశ్వరి, విష్ణు, ఎమ్మెల్సీ మాధవ్‌, ‌రావెల కిషోర్‌ ‌బాబు తదితరులు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. కేంద్రం అన్ని గ్రామాలకు ఎల్‌ఈడీ బల్బులు ఇచ్చిందన్నారు. జన్‌ధన్‌ ‌ఖాతాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపామని సోము వీర్రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల జీవనాడి అని.. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీది ఎప్పుడూ ఒకటే మాట.. ఒకటే సిద్దాంతమని అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర పార్టీలు తెలంగాణలో విభజన వాదం.. ఏపీలో సమైక్యవాదం పేరుతో ప్రజల్ని మోసం చేశాయని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కోవిడ్‌ ఎమర్జెన్సీ ప్రకటించి..15 రోజుల పాటు దానిపై దృష్టి పెట్టాలని సోము వీర్రాజు సూచించారు. అప్పుడే కరోనా కేసులను తగ్గించగలమన్నారు. కరోనా నియంత్రణకు కేంద్రం తగిన విధంగా సాయం అందించిందన్నారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ వాణి వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ అవసరం ఉందని, ఏపీ అభివృద్ధే బీజేపీ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఉన్నాయని, ఏపీ అభివృద్ధికి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు.

మూడు రాజధానులు ఓ జోక్‌: ‌రాంమాధవ్‌
ఏపీలో మూడు రాజధానులపై  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ ‌నే ఓ జోక్‌ ‌గా కొట్టిపారేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వం నిర్ణయానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు.. దీంతో.. కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయన్నారు. విభజన తరువాత అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని చెప్పామని.. చంద్రబాబు అమరావతి రాజధానిగా ప్రకటిస్తే కేంద్రం అభ్యంతరం చెప్పలేదన్న ఆయన.. నిధులు కేటాయించి ప్రోత్సహించాం.. యూనివర్సిటీలు పెట్టామని గుర్తుచేశారు.  ఇప్పుడు మూడు రాజధానులు అంటే… కేంద్రం జోక్యం చాలా పరిమితంగా ఉంటుందన్నారు.  ఒక రాజధాని నిర్మాణంలో అవినీతిని బిజెపి ప్రశ్నించింది.. మూడు రాజధానుల పేరుతో మళ్లీ అవినీతి చేస్తే బీజేపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు.  దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ ‌కి ఒక్కటే రాజధాని అయినప్పుడు.. ఇక్కడ మాత్రం మూడు ఎందుకు.. ఇది కేవలం అవినీతికి అవకాశం ఇవ్వడానికే అని వ్యాఖ్యానించారు. ఎక్కడా లేనట్లు నామినేషన్ల పర్వంలోనే దౌర్జన్యాలు జరిగిన రాష్ట్రం ఇదే.. ఈసారి మాత్రం రు అలాంటి దౌర్జన్యాలను తిప్పికొట్టాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మరో మాట కూడా చెప్పారు.. ప్రతి దానికి ఢిల్లీ ఏదో చేయాలని ఎదురు చూడకుండా.. రే రాష్ట్రంలో గట్టిగా పోరాడాలి.. వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అయితే అమరావతి రైతులు, ప్రజలకు పూర్తి గా న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు వేచిచూద్దాం అని రాంమాధవ్‌ అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!