రాజీవ్ కాలనీని అన్ని విధాలా అభి చేస్తాం – అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం,జూన్ 5 : గత పాలకులు ఐదేళ్ల పాలనలో అభిరుద్దిని పూర్తిగా విస్మరించడమే కాకుండా అరచేతిలో వైకుంఠం చూపించిన ఘనతను సాధించారని అనంతపురంఅర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి పనులను అనంతపురం ఎంపీ తలారి రంగయ్య తో కలసి అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రారంభించారుఈ సందర్భంగా పూజలు నిర్వహించి పనులు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా ఇచ్చిన ప్రతి హాని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతోందన్నారు. అభివృద్దిలో అనంతపురం నగరాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా ముందడుగు వేస్తున్నాం.గత ఎన్నికల సమయంలో ముందుకు వచ్చినపుడు తమకు అవకాశం ఇస్తే ఏమి చేస్తామో చెప్పినపుడు మా మాటలు విశ్వశించి మాకు అవకాశం కల్పించారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజీవ్ కాలనీలో దాదాపు 7 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసాం.వీటితోపాటు ప్రజల ముంగిటకే సేవలు అందించేందుకు సచివాలయాల భవనాలు,ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపడుతున్నాం.
అంతేకాకుండా గత టీడీపీ పాలకులు దత్తత తీసుకున్నాం అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించారు తప్ప అభిరుద్దిని విస్మరించారు. అదే విధంగా రాజీవ్ కాలనీ బ్రిడ్జి కి సైతం గతంలో రూ.1.56 కోట్లు మాత్రమే మంజూరు కావడంతో నిధులు సరిపోక పనులు అర్దాంతరంగా ఆగిపోయాయి. ఎంపీ తలారి రంగయ్య సహకారంతో పి ఎం జి ఎస్ వై నిధులను 1.80 కోట్ల రూపాయలను మంజూరు చేయించి అర్దాంతరంగా ఆగిన బ్రిడ్జి పనులు పూర్తి చేస్తున్నాం.కేవలం బ్రిడ్జి పనులు పూర్తి చేయడమే కాకుండా బ్రిడ్జి కోసం ఇళ్ళు కోల్పోతున్న దాదాపు 80 మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం తోపాటు ఇళ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాం. దీనితో పాటు లెక్చరర్ కాలనీ నుండి గుత్తి రోడ్డు లోకి ప్రత్యేక రోడ్డును ఏర్పాటు చేయాలని స్థానికుల కోరిక మేరకు త్వరలోనే పనులు ప్రారంబిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాజీవ్ కాలనీ వాసులను వేధిస్తున్న డంప్ యార్డ్ ను తరలిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హా మేరకు ఇప్పటికే డంప్ యార్డ్ తరలింపునకు అవసరమైన భూ సేకరణను పూర్తి చేశామని బయో మైనింగ్ ప్లాంట్ మంజూరు కోసం జిల్లా ఇంచార్జి మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లామని కోవిడ్ విపత్తు మూలంగా మంజూరు కాస్తా ఆలస్యం అయ్యిందని త్వరలోనే డంపింగ్ యార్డ్ తరలింపు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ రహదారులు అభిరుద్దికి సూచికలు అన్నారు. రహదారులు అభిరుద్ది చెందితే భూముల విలువలు పెరిగి అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అందరి ఆశీస్సులతో మాకు పదవులు దక్కాయని నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభిరుద్ది,సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పనిచేసే ముఖ్యమంత్రి కి మాకు మరోమారు అవకాశం ఇవ్వాలని ఎంపీ సూచించారు. కార్యక్రమంలోఎస్ సి భాగ్యరాజ్, ఈ ఈ శ్రీనివాసులు,డి ఈ రాచంరెడ్డి భాస్కర్ రెడ్డి,కార్పొరేటర్ కొగటం భాస్కర్ రెడ్డి,ఎంపిడిఓ భాస్కర్ రెడ్డి,సర్పంచ్ ఆశాభి,పంచాయతీ కార్యదర్శి అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.