Take a fresh look at your lifestyle.

ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తాం

  • తెలంగాణలోనే ఓసి పేదలకు సహాయం
  • దుబ్బాక ఆర్యవైశ్య అలాయ్‌ – ‌బలాయ్‌లో మంత్రి హరీష్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.  దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఓసి పేదలకు  సహాయం అందడం లేదనీ ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఓసి పేదలకు సహాయం అందుతుందనీ, దేశంలో ఈ విధానం ఎక్కడా లేదన్నారు. సోమవారం  సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఆర్యవైశ్య భవన్‌లో ఏర్పాటు చేసిన అలాయ్‌ – ‌బలాయ్‌లో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..రాష్ట్రంలో తప్పకుండా ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామనీ హామీ ఇచ్చారు.

దుబ్బాకకు ఇప్పుడు వస్తున్న బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీల నేతలందరూ కేవలం వోట్ల కోసమే వస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన ప్రస్తుత టిపిసిసి ప్రెసిడెంటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కసారైనా దుబ్బాకకు రాలేదన్నారు. ఉత్తమ్‌కు దుబ్బాక ఎలా ఉంటుందో కూడా తెలియదన్నారు. దుబ్బాకకు ఉప ఎన్నిక రావడంతోనే వోట్ల కోసం పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుబ్బాకకు వచ్చాడన్నారు. హుజూర్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే ఏమొచ్చిందని ఉత్తమ్‌ అడుగుతున్నారనీ…హుజూర్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే •గెలిచాక  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వెళ్లి  నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ 300‌రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు.  అభివృద్ధి పనులకు హుజూర్‌నగర్‌కు ఇచ్చిన రీతిలోనే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వస్తాయన్నారు. దుబ్బాక అభివృద్ధి పూర్తి బాధ్యత తనదేనన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply