సూర్యాపేట, జూన్ 12, ప్రజాతంత్ర ప్రతినిధి): సూర్యాపేట ఖమ్మం 365 బిబి జాతీయ రహదారి నిర్మాణ పనులలో పెంచే నష్టపరిహారం నిబంధనల మేరకు పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చివ్వెంల, మోతె మండలాల్లోని నాలుగు గ్రామాలలో నివాస గృహాలు కోల్పోయిన బాధితు లతో ఏర్పాటుచేసిన సమావేశంలో విజ్ఞప్తులను ఆర్డిఓ మోహన్రావులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రెండు మండలా లలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో గృహాలకు, వ్యవసాయ, వ్యవసా యేతర భూములకు ఇచ్చే నష్టపరిహారం ప్రభుత్వ నిబంధనలకు లోబడి చెల్లింపులు చేయడం జరిదిందని, అయినప్పటికీ నివాస గృహాలు కోల్పోయిన వారి పరిహారం కొంత పెంచాలని సమావేశంలో 101మంది అభ్యర్థనలను స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు.
అట్టి దరఖాస్తులను పునర్ పరిశీ లించి నష్ట పరిహారం పెంపుపై అర్బిటేటర్గా వ్యవహరించి నిబంధనల మేరకు న్యాయం చేస్తానని అన్నారు. ఇప్పటికే భూసేకరణ జరిగిందని తెలుపుతూ నష్టపరిహారం పెంపుదలపై విజ్ఞప్తులు ఉన్నందున 80శాతం నష్టపరిహారం పొంది ఉన్నారు. కాబట్టి భూసేకరణ చేసిన భూమి అంతకూ డా జాతీయ రహదారి సంస్థకు అప్పగించనైనదని గృహ యజమానులు రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు కల్పించవొద్దని పేర్కొన్నారు. సమావేశంలో ఈఈ, ఆర్అండ్బి , ఎన్హెచ్ అధికారులు, చివ్వెంల, మోతె, తహశీల్దార్, విఆర్ఓలు పాల్గొన్నారు.