Take a fresh look at your lifestyle.

హాస్పిటల్‌ ‌ల్లో బెడ్‌ ‌బుక్‌ అయితేనే అనుమతిస్తాం

అంబులెన్సులను తెలంగాణ అడ్డుకోవడం లేదు: హెల్త్ ‌డైరెక్టర్‌
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లతో సమస్యలు వస్తున్నాయని తెలంగాణ హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ అన్నారు. ఇతర ప్రాంతాల రోగుల కారణంగా తెలంగాణకు కేటాయించిన ఆక్సిజన్‌, ఇతరత్రా మందులు వాడాల్సి వస్తోందని అన్నారు. అందుకే అనుమతులు తప్పనిసరి చేశామని అన్నారు. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను అడ్డుకుంటున్నారన్నదానిపై స్పందించిన ఆయన శుక్రవారం వి•డియా సమావేశంలో మాట్లాడుతూ మేం ఎక్కడా అంబులెన్స్‌లను అడ్డుకోవడం లేదన్నారు. ముందస్తుగా హాస్పిటల్‌ ‌ల్లో బెడ్లు బుక్‌ ‌చేసుకున్న తర్వాతే రాష్ట్రంలోకి రావాలన్నారు.

ఎవరైతే తెలంగాణలో హాస్పిటల్‌ ‌లో అడ్మిట్‌ అవ్వాలని అనుకుంటున్నారో వారు బెడ్‌ ‌రిజర్వేషన్‌ ‌లేకుండా నేరుగా వచ్చేసి హాస్పిటల్‌ ‌కి వెళ్లడం, అక్కడ బెడ్‌ ‌లేకపోతే మరో హాస్పిటల్‌ ‌కి వెళ్లడం.. ఇలా మొత్తంగా బెడ్‌ ‌కోసం ఐదారు హాస్పిటల్‌ ‌ల చుట్టూ తిరుగుతున్నారని.. ఈ నేపథ్యంలో పేషెంట్లకు సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అదే సమయంలో స్థానికులకు కొరోనా ప్రభావం చూపుతోందన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గైడ్‌లైన్స్ ‌రూపొందించిందని శ్రీనివాస్‌ ‌తెలిపారు. దీనికి సంబంధించి ఆయా రాష్టాల్రకు లెటర్‌ ‌రాసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో స్టేట్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేశామని శ్రీనివాస్‌ ‌తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తెలంగాణలో ఏ హాస్పిటల్‌ ‌నైనా బెడ్‌ ‌రిజర్వు చేసుకోవాలన్నారు.

ఆ తర్వాత హాస్పిటల్‌ ‌సిబ్బంది స్టేట్‌ ‌కంట్రెల్‌ ‌రూమ్‌కు ఫోన్‌ ‌చేస్తారని, అక్కడి సిబ్బంది ఒక ఫార్మాట్‌లో వివరాలు రాసుకుని వాళ్లు హెల్త్ ‌కార్యాలయానికి పంపుతారని, దాంతో ఆ పేషెంట్‌ ‌తెలంగాణలోకి రావడానికి పర్మిషన్‌ ‌లెటర్‌ ఇస్తామని శ్రీనివాస్‌ ‌తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లకు అనుమతిపై ఈ కంట్రోల్‌ ‌రూమ్‌ ‌పర్యవేక్షిస్తుందని, 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు. ఇతర రాష్టాల్ర నుంచి వచ్చే చాలా మంది రోగులకు తెలంగాణలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ నిబంధనల ప్రకారం ట్రీట్‌మెంట్‌ ‌చేస్తున్నామని, అంతేగానీ వేరే రాష్టాల్ర నుంచి వచ్చే పేషెంట్లకు చికిత్స చేయమని చెప్పలేదని శ్రీనివాస్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply