- రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి
- అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీమ్ కోర్టు
రోడ్లపై నడుచుకుంటూ పోతున్న వలస కార్మికులను గుర్తించి, వారిని, వారి సొంత ప్రదేశాలకు ఉచిత రవాణాతో తరలించే లాగా చేయాలనీ. అలాగే వలస కార్మికులకు ఆశ్రయం కల్పించి ఆహారాన్ని అందించేలాగా అన్ని రాష్ట్రాల డిస్ట్రినడిచి వెళుతున్న కార్మికులను ఆపలేము క్ట్ మెజిస్ట్రేట్ లకు కేంద్రం ఆదేశించేలాగా.. కేంద్రానికి, సుప్రీం కోర్ట్ దిశానిర్ధేశం చేయాలి అన్న అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఔరంగాబాద్ లో రైలు పట్టాలపై కార్మికులు చనిపోయిన అనతరం శ్రీవాస్తవ అనే లాయర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఔరంగాబాద్ సంఘటనలో మధ్యప్రదేశ్ కి తిరిగివచ్చే ప్రయత్నంలో రైల్వే ట్రాక్స్‌లో పడుకున్న 16 మంది వలస కార్మికులపైనించి గూడ్స్ రైలు ప్రయాణించగా వీరంతా మరణించారు. ఈ నేపథ్యంలో వలస కార్మికుల సమస్యపై అత్యున్నత న్యాయస్థానం జోక్యం కోరి శ్రీవాస్తవ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్ట్ రోడ్లపై నడిచే వలస కార్మికుల పర్యవేక్షణ కోరుతూ ఉపశమనం కోసం వేసిన అభ్యర్ధనను తిరస్కరించింది. దేశవ్యాప్తంగా నడుస్తున్న వలస కార్మికుల కదలికలను కోర్టులు పర్యవేక్షించడం లేదా ఆపడం అసాధ్యమని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్ట్ అభిప్రాయపడింది. పిటిషన్ను దాఖలు చేస్తూ, న్యాయవాది అలఖ్ అలోక్ శ్రీవాస్తవ ఇటీవల మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ హైవేలపై జరిగిన ప్రమాదాలలో వలస కార్మికులు మరణించిన సంఘటనలను కూడా ప్రస్తావించారు.
కరోనావైరస్ ప్రేరిత లాక్డౌన్ తరువాత అనేక రాష్ట్రాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కూలీలు ఇంటికి చేరుకోవడానికి రోడ్లపై వందల కిలోమీటర్లు నడుస్తున్నారు అని పిటిషనర్ చేసిన వాదనలు విన్న జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ వలస కార్మికులను రోడ్లపై నడవకుండా ఆపడానికి ఏమైనా మార్గం ఉందా..? అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగారు. దీనికి, మెహతా మాట్లాడుతూ, వలస కార్మికులకు రాష్ట్రాలు, అంతర్రాష్ట్ర రవాణాను అందిస్తున్నాయి, కాని వలస కార్మికులు రవాణా కోసం ఎదురుచూడకుండా కాలినడక ప్రారంభించారు అంచేత ఏమి చేయలేము అని సమాధానం ఇచ్చారు. ఈ వలస కార్మికులను కాలినడకన నడవవద్దని మాత్రమే ప్రభుత్వం అభ్యర్థించవచ్చని తుషార్ మెహతా వాదించారు. బలవంతంగా ఆపడానికి ఏదైనా శక్తిని ఉపయోగించడం సరికాదని కోర్ట్ ముందు మెహతా వాదించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ విషయాన్ని విన్న బెంచ్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు తమ మధ్య ఒప్పందాలకు లోబడి ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానాలకు వెళ్లే విధంగా చేసే అవకాశం ఉందని తుషార్ మెహతా తెలిపారు. ప్రభుత్వం వాదన వినిపించే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్న బెంచ్ “మేము వలస కార్మికుల నడకను ఎలా ఆపగలం?” అని వ్యాఖ్యానించింది . న్యాయమూర్తులు ఎస్ కె కౌల్ బి ఆర్ గవైలతో కూడిన ధర్మాసనం, ఈ సమస్యలపై రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. లాయర్ శ్రీవాస్తవ అభ్యర్ధనను వినడానికి బెంచ్ ఇష్టపడటం లేదని చెప్పిన ధర్మాసనం,రోడ్డుపై ఎవరు నడుస్తున్నారు, ఎవరు నడవడం లేదు అనేది కోర్టు పర్యవేక్షించడం అసాధ్యమని చెప్పింది.