Take a fresh look at your lifestyle.

మిమ్ములను ఏం మరిసిపోరు

వ్యాక్సిన్‌ ‌వస్తుందన్న కల
ఇప్పట్లో నెరవేరే ఆశ కనబడటం లేదు

బతుకు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ
కుదురుగా కూర్చోనీయడంలేదు

పదుల నుండి వేల సంఖ్యకు  మారిన మహామ్మారి
ఇంకను ప్రాణాలకు భరోసా ఇవ్వని యంత్రాంగం

సర్వ శక్తులను వైద్యంపై మోహరించి
సామాన్యునికి సాంత్వన కల్గించే సమయం
మేమున్నామనే ఆశ్వాసం కల్పించే సందర్భం

ఎందుకింత ఘోరం
దేనికింత నిర్లక్ష్యం
ప్రజాకర్షక పథకాలతో పవరులోనికి
వచ్చారు కదా

ప్రాణాలు గాల్లో కలుస్తుంటే
పైసల లెక్కలు అవసరమా
ఏ లెక్కలు చూసి భూమిలో అడుగు
పెట్టని వాడు
అరక పట్టని
వందల ఎకరాల భూస్వాములకు
ప్రజా ధనాన్ని అప్పనంగా ఎలా పంచారు

ఏ లెక్కల యిది పురోగామి అభివృద్ది మంత్రం
ఎన్ని ఆదర్శాలను వలపోసి
తెచ్చుకున్న రాష్ట్రం

రికార్డులను ఒక్కసారి తిరగవేస్తే
ఎట్లా వెక్కిరిస్తాయో  తెలుస్తుంది

అయినా
తవ్వుకుంటూబోతే బయటపడే
పెంకలు శానున్నయ్‌
ఇప్పుడు గవన్ని వద్దు

పాలకులార
మీకో నమస్కారం
పైసల్లేని పాణాలకు భరోసా ఇచ్చే
నగదు రహిత వైద్యాన్ని అందించండి
బతికుంటే మిమ్ముల్ని  ఏం మరిసి పొరు.

– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి
9494789731

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply