Take a fresh look at your lifestyle.

దేశానికే మోడల్‌గా నిలిచేలా రాజీవ్‌ ‌రహదారిని గ్రీన్‌ ‌కారిడార్‌గా తీర్చిదిద్దుతాం జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి

సిద్ధిపేట, జూలై 24 (ప్రజాతంత్ర బ్యూరో): రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి అనుగుణంగా దేశానికే ఆదర్శంగా ఉండేలా జిల్లా పరిధిలోని రాజీవ్‌ ‌రహదారిని గ్రీన్‌ ‌కారిడార్‌గా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామ రెడ్డి తెలిపారు. శనివారం గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణం సమీపంలోని మర్పడగలోని తేజోవనం అర్బన్‌ ‌పార్క్‌లో జిల్లా కలెక్టర్‌ ‌స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. హరిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు హరిత హరంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఈ  ఒక్కరోజే తెలంగాణలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్‌ ‌తెలిపారు. ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచన మేరకు జిల్లాలో అడవుల శాతాన్ని పెంచి.. కాలుష్యాన్ని తగ్గించి, ఆరోగ్య సిద్దిపేట దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. పచ్చదనం పెంచేందుకు, హారిత తెలంగాణ తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచన మేరకు జిల్లాలో ఈ ఒక్కరోజు కనీసం 12 లక్షల మొక్కలు నాటే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఒక లక్షా 50 వేల మొక్కలు ప్రత్యేకంగా నాటనున్నట్లు కలెక్టర్‌ ‌తెలిపారు. ప్రతి మండలంలో నీ బృహత్‌ ‌హరిత వనంలో 30 వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.అలాగే, ప్రజా ప్రతినిధులు సహకారం ప్రజా భాగస్వామ్యం తో అన్ని నర్సరీలోని మొక్కలను ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలు , మండలాలు, పట్టణాలలో నాటే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన సాగుతుందన్నారు. జిల్లాలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజా ప్రతినిధులకు కలెక్టర్‌ ‌ధన్యవాదాలు తెలిపారు. భాగస్వామ్యమైన అధికారులను అభినందించారు. రాజీవ్‌ ‌రహదారి ఇరువైపులా 3 వరుసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరాయంగా కురిసిన వర్షాల వల్ల వాయిదా వేశామని కలెక్టర్‌ ‌తెలిపారు. వర్షాలు తగ్గు ముఖం పట్టడం వల్ల వచ్చే సోమవారం నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపట్టి సఫలీకృతం చేస్తామన్నారు. రాజీవ్‌ ‌రహదారి ప్లాంటేషన్‌ ‌దేశానికే ఆదర్శంగా ఉండేలా ఇప్పటికే గ్రామ పంచాయితీ వారీగా కార్యాచరణ సిద్ధం చేసి అధికారుల బృందాలను ఏర్పాటు చేశామన్నారు.నాటిన మొక్కలను 3 సంవత్సరాల పాటు సంరక్షించనున్నట్లు కలెక్టర్‌ ‌స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి  శ్రీధర్‌ ‌రావు, డిఆర్‌డివో గోపాల్‌ ‌రావు, డిపివో పార్థ సారథి, స్థానిక ఎంపిపి ర్యాగల సుగుణ దుర్గయ్య, ప్రజాప్రతినిధులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply