Take a fresh look at your lifestyle.

మావోయిస్టు రహిత జిల్లాలుగా తీర్చిదిద్దుతాం

వారు సంచరించే ప్రాంతాలు ఇప్పటికే గుర్తించాం రాష్ట్ర డిజిపి మహేందర్‌ ‌రెడ్డి వెల్లడి

భద్రాచలం, డిసెంబర్‌ 01(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్‌ఘడ్‌ ‌నుండి మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోకి తరలి వొస్తున్నారని, వీడిన అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డిజిపి మహేందర్‌ ‌రెడ్డి డిఇ వెల్లడించారు. మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించి మావోయిస్టు రహిత జిల్లాలుగా తీర్చిదిద్దుతామని డీజీపీ తెలిపారు. బుధవారం నాడు భదాద్రి కొత్తగూడెం జిల్లా లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి పర్యటించారు.

ముందుగా చర్ల మండలంలోని చెన్నాపురం బేస్‌ ‌క్యాంపు వద్దకు వెళ్లి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మావోయిస్టు కదలికలను తెలుసుకొని ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులను నిర్మూలించాలని అక్కడి భద్రతా బలగాలకు సూచనలు ఇచ్చారు. అనంతరం సారపాక ఐటీసీ గెస్ట్ ‌హౌస్‌లో సిఆర్‌పిఎఫ్‌ అడిషనల్‌ ‌డిజిపి రష్మీ శుక్ల మరియు ఐజి నాగిరెడ్డి సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి అరాచక శక్తులు లేకుండా చర్యలు చేపట్టాలని అని జిల్లా పోలీసు అధికారులు బీజేపీ ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల భూపాలపల్లి ములుగు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతాల్లో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి మావోయిస్టులను అరికట్టాలని సూచించారు.

అనంతరం డీజీపీ విలేఖరులతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉందని అన్నారు. చత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో మావోయిస్టులు ఉన్నారని వారు మన తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యంగా భదాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు, భూపాలపల్లి జిల్లాలను మావోయిస్టు రహిత జిల్లాలుగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎంతగానో కృషి చేస్తూ సహకరిస్తున్నారని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రజలను అభినందించారు. ముఖ్యంగా భదాద్రి జిల్లా మావోయిస్టు రహిత జిల్లాగా ఇప్పటికే సాధించుకున్నమని అందుకు ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ముఖ్యంగా ప్రజల సహకారమే కారణమని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. డీజీపీ వెంట ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ‌మరియు జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు.

Leave a Reply