- 120 మునిసిపాలిటీలో 119 గెలిచాం
- 10కార్పొరేషన్లలో విజయం సాధించాం
- టీఆర్ఎస్ విధానాలను ప్రజలు ఆశీర్వదించారు
- తప్పులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం
- పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు : రాష్ట్ర మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని 141 మునిసిపాలిటీల్లో, అన్నీ కార్పొరేషన్లో కొత్తగా రూపొందించిన చట్టాన్ని అమలు చేసి తీరుతామని, ఉద్యోగులకు అవినీతికి పాల్పడితేకఠినంగా శిక్షిస్తామని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెండ్, రాష్ట్ర మునిసిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.తెలంగాణ ప్రజలు మునిసిపల్‌ఎన్నికల్లో అనితర సాథ్యమైన విజయాన్ని ఇచ్చారని, ప్రజలందరికీ కృతజ్ఞతలందచేస్తూ, సేవచేసేందుకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. 120మునిసిపాలిటీలలో 119, 10కార్పొనేషన్లలో టీఆర్ఎస్కు అఖండ మెజారిటీని ఇచ్చి టీఆర్ఎస్ నిర్ణయాలన్నింటినీ ప్రజలు గౌరవించారని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఆదర్శవంతమైన పట్టణాల నిర్మాణం తమ లక్ష్యమ ని స్పష్టం చేశారు.సోమవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు, టీఆర్ఎస్ అఖండవిజయం, తదితర విషయాలను వివరిస్తూ, కాంగ్రెస్,బీజేపీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతీ నెల మునిసిపాలిటీలకు, కార్పొరేషన్లకు రూ.2074కోట్లు మొదటివారంలోనే విడుదల చేస్తామని పట్టణాలకు నిధుల కొరత ఉండదని చెప్పారు. నిధులు, విధులు, ఇస్తామని, అక్రమాలకు పాల్పడితే కఠినంగా కూడా ఉంటామని హెచ్చరించారు.పురపాలన పరిపాలనపైన ప్రత్యేక శ్రద్ధవహిస్తామని చెప్పారు. పట్టణాలకోసం ప్రణాళికా బద్దమైన అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తామని, పట్టణప్రగతి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షపర్యవేక్షణలో నిధులు విడుదల చేస్తామని, పట్టణాల్లో జరిగే పనుల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికైన అభ్యర్థులందరికీ పార్టీలకు అతీతంగా శిక్షణఇస్తామని చెప్పారు,అక్రమలేఔట్లను, అక్రమనిర్మాణాలను, చెరువుల కబ్జాలను ఉపేక్షించే ప్రసక్తి ఉండదని, విలేకరుల కబ్జాల వార్తలను రాయాలను కేటీఆర్ కోరారు.
పౌరులు కేంద్రంగా కొత్త మునిసిపల్చట్టం పనిచేస్తుందని చెప్పారు.పనిచేయకపోతే పదవులు పోతాయనే విషయాన్ని శిక్షణాకార్యమ్రాల్లోనే చెప్తామని అన్నారు. ఈ హెచ్చరిక వర్తిస్తుందని అన్నారు. మునిసిపాలిటీల్లోజవాబుదారీ తనం పెంచుతామని పేర్కొన్నారు.మునిసిపపల్ ఉద్యోగులందరికీ వర్తించే విధంగా అందరికీ సమానమైన బదిలీ విధానాన్ని తీసుకవచ్చామని, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు ఉంటాయని, పేర్కొన్నారు. పట్టణ ప్రణాళికశాఖలో పనిచేసే ఉద్యోగులు పాతవిధానాలకు స్వస్తిచెప్పాలని, నూతన చట్టం స్పూర్తితో పనిచేయాలని ఆదేశించారు.గృహయజమానులు స్వచ్ఛందంగా తమ ఇంటి వివరాలన్నింటినీ ఇవ్వాలని, తప్పుడు వివరాలను ఇస్తే శిక్షార్హులవుతారని హెచ్చరించారు.వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా తమ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించి స్వచ్ఛందంగా వివరాలను అందించాలని కోరారు. భవననిర్మాణాలకు 21రోజుల్లో అనుమతులు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకవచ్చామని, ఎక్కడైనా పని జరుగకపోతే ఫిర్యాదులు చేయవచ్చునని చెప్పారు. మునిసిపాలిటీలన్నింటిలో డిజిటల్ ఇంటి నెంబర్విధానాన్ని అమలులోకి తెస్తామని చెప్పారు.33 జిల్లాల్లో ప్రతీ జిల్లాలో నాలుగనుంచి ఐదు మునిసిపాలిటీలు ఉన్నాయని, కలెక్టర్ల సారథ్యంలో స్పెషల్ టాస్ప్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్ష్ అఫిసీయో ఓటుపై వచ్చిన వివాదాలను ప్రశ్నించగా,1999లో ఎన్టీఆర్, 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన చట్టాల ప్రకారం టీఆర్ఎస్ ఎక్స్ అఫిసీయో ఓటింగ్‌ను ఉపయోగించుకున్నదని, ఇందులో రాద్ధాంతం చేయాల్సింది, ధర్నా చేయాల్సింది ఏమీ లేదని అన్నారు. 2014లకుపూర్వం 68 మునిసిపాలిటీలు మాత్రమే ఉండేవని, టీఆర్ఎస్ వీటి సంఖ్యను 141లకు పెంచిందని చెప్పారు. పరిపాలన ప్రతీ క్షత్రస్థాయి వరకు వెళ్లాలన్న లక్ష్యంతో, సర్వతోముఖాభివృద్ధి జరగాలనే సంకల్పంతో మునిసిపాలిటీల సంఖ్యను పెంచామని, గొప్ప ఫలితాలు వస్తున్నాయని, మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంఖ్యకు అనుగుణంగా వార్డుల విభజన జరిగిందని, తక్కువ ఓటర్లు ఉండేవిధంగా వార్డుల విభజన జరిగిందరి, తద్వారా అందరికీ అభివృద్ధి ఫలాలు అందించడం సాద్యమవుతుందని చెప్పారు.బర్సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ వంటి సర్టిఫికేట్లు వేగంగా పౌరులకు లభించేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చాలా వరకు కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీల్లో భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ప్లాన్లను సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదని, త్వరలో ఆ పని పూర్తి చేస్తామని చెప్పారు.
Tags: municipalities and corporations,implement new municipal law, ktr