Take a fresh look at your lifestyle.

రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుయార్‌ ‌రెడ్డి

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయని ఈ భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతింటున్నాయని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. వరి, మొక్కజొన్న, పత్తి తడితర పంటలు అధిక వర్షాలకు పాడయ్యి రైతులు నష్టపోతున్నారని అన్నారు.

మంగళవారం జూమ్‌ ‌యాప్‌ ‌ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ,జాతీయ కిసాన్‌ ‌సెల్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఇతర నాయకులు ప్రెస్‌ ‌మీట్‌ ‌లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .. ప్రభుత్వం తెలంగాణలో ఒక్కసారి కూడా రైతులకు నష్టపరిహారాలు అంచనా వేసి ఆదుకున్న పాపాన పోలేదని విమర్శించారు.మొక్కజొన్న పంటలు కొనమని ప్రభుత్వం చెప్తుంది దింతో  మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇచ్చి మొక్కజొన్నలు కొనాల్సిందే ,రైతులను ఆడుకోవాల్సిందేనని సర్కార్‌ ‌ని డిమాండ్‌ ‌చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply