- ప్రజారవాణాకు పెద్దపీట
- శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రతిపాదనలు సిద్ధ్దం
- అసెంబ్లీలో మంత్రి కెటిఆర్ వెల్లడి
ప్రజారవాణాకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రతీ రోజు దాదాపు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వరకు.. ట్రామ్ లేదా ఇతర రవాణా మార్గాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అటు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5 కిలోటర్ల కారిడార్ ను చేపడుతామని కేటీఆర్ అన్నారు. ఆ మార్గంలో హెరిటేజ్ భవనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హా ఇచ్చారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్దంచేస్తున్నామని అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నగరంలోని పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్ట్ను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. పాతబస్తీలో మెట్రో లైన్ కోసం మత సంబంధ ఆస్తుల సేకరణను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పూర్తి చేస్తామన్నారు. మెట్రోలో కేంద్రం వాటా 10 శాతమేనన్నారు. అందులో ఇంకా రూ. 250 కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ప్రజా రవాణాలో చాలా సీరియస్గా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో హైదరాబాద్ అభివృద్ధికి బ్జడెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అందులో ప్రజా రవాణాకు చాలా పెద్ద పాత్ర ఉండబోతున్నట్లు తెలిపారు.