Take a fresh look at your lifestyle.

ఆంధ్రభూమి ఉద్యోగులకు న్యాయం చేస్తాం: పీసీఐ సభ్యులు మాజీద్

బషీర్ బాగ్,మార్చి6: ఆంధ్రభూమి ఉద్యోగుల పట్ల ఆ పత్రిక యాజమాన్యం అనుసరిస్తున్న ధోరణి సరైంది కాదని, ఉద్యోగుల పక్షానా నిలబడి న్యాయమైన వారి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సభ్యులు ఎం.ఏ.మాజీద్ భరోసా నిచ్చారు. శనివారం నాడు బషీర్ బాగ్ లోని దేశోధ్ధారక భవన్ లో ఆంధ్రభూమి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆయనకు వినతి పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నాడు తాను ఢిల్లీకి వెళ్లి పీసీఐలో పిటిషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రభూమి ఉద్యోగుల అసోసియేషన్ కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్, టీయూ డబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల నేతృత్వంలో ఉద్యోగులు విజయప్రసాద్ , జెఎస్ఎన్ మూర్తి, స్వామినాథ్, అబ్దుల్ తదితరులు మాజీద్ ను కలిశారు.

Leave a Reply