Take a fresh look at your lifestyle.

అధ్యక్ష ఎన్నికల్లో అంతిమ విజయం మాదే

  • ఫలితాలు వెలువడే వరకు సంయమనం పాటించాలి
  • కొరోనా కట్టడిపైనే తమ తొలి ప్రాదాన్యం
  • మీడియాతో మాట్లాడిన జో బైడెన్‌

‌విల్మింగ్టన్‌,‌నవంబర్‌7:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై 40 లక్షల వోట్లతో గెలుపు సాధిస్తామని డెమోక్రటిక్‌ అభ్యర్థి బిడెన్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. అయితే కౌంటింగ్‌ ఇం‌కా కొనసాగుతోందని, ప్రజలు సంయమనం పాటించాలని మీడియాతో అన్నారు. ఎన్నికల ఫలితాలపై శుక్రవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ గెలిచినట్లు ఇప్పుడే ప్రకటించడం లేదని, అయితే ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో గెలవబోతున్నామని ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి స్పష్టమైందని అన్నారు. 24 గంటల క్రితం జార్జియాలో వెనుకంజలో ఉన్న తాము ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నామని, పెన్సిల్వేనియాలో కూడా ముందంజలో ఉన్నామని అన్నారు. 24 ఏళ్ల అనంతరం అరిజోనాలో, జార్జియాలో గెలుపొందుతున్న డెమోక్రాట్స్ ‌తామేనంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లతో విజయం సాధించబోతున్నామని, ట్రంప్‌పై 40 లక్షల ఓట్ల తేడాతో గెలుస్తామని చెప్పారు. 300కి పైగా ఎలక్టోరల్‌ వోట్లు సాధించబోతున్నామని బిడెన్‌ అన్నారు.

కొరోనా వైరస్‌, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ మార్పు, జాతి విద్వేషం వంటి అంశాల్లో డెమోక్రాట్లు ప్రకటించిన ప్రణాళికలకు ప్రజలిస్తున్న తీర్పు ఇదని అన్నారు. శుక్రవారం తాజాగా 1,27 వేల కొరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తాము అధికారం చేపట్టిన తక్షణమే కొరోనా నివారణ కోసం రూపొందించిన ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తామని బిడెన్‌ ‌చెప్పారు. ఇకపై ప్రజలెవరూ కొరోనాతో ప్రాణాలు పోగొట్టుకోవడం జరగదని అన్నారు. రోవైపు ట్రంప్‌ ‌మద్దతుదారులు అనేక నగరాల్లోని ఎన్నికల కార్యాలయాల వెలుపల ఆగ్రహం వ్యక్తంచేశారు. చాలా వరకు నిరసనలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఫిలడెల్ఫియాలో వోట్ల కౌంటింగ్‌ ‌జరుగుతున్న ప్రాంతానికి ఇద్దరువ్యక్తులు ఆయుధాలతో వచ్చారని అధికారులు తెలిపారు. ప్లోరిడాలోని పోర్ట్ ‌లౌడెర్‌డేల్‌ ‌ప్రాంతంలో జరిగిన ర్యాలీలో ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరుమహిళలకు గాయాలయ్యాయి. ర్యాలీ లక్ష్యంగానే దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply