Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌ ఎన్నికల్లో బాక్సులు బద్ధలు కొడతాం

బీజేపీ బరాబర్‌ ‌హిందువుల పార్టీ
మేము శివాజీ వారసులమయితే..కెసిఆర్‌ ‌బాబర్‌ ‌వారసుడు
బిజెపిలో చేరిన కార్పొరేటర్‌ ‌తోకల శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్‌ను సర్వనాశనం చేసిన టిఆర్‌ఎస్‌ : ‌బిజెపి నేత లక్ష్మణ్

‌బీజేపీ బరాబర్‌ ‌హిందువుల పార్టీ అంటూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మానికి అడ్డం వొచ్చిన వాళ్లను తొక్కేస్తామంటూ ఆయన హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి నియంత, నికృష్ట ముఖ్యమంత్రి అని బండి సంజయ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌నాయకుల బాక్సులు బద్ధలు కొడతామంటూ సవాల్‌ ‌విసిరారు. తెలంగాణలో బియ్యం, డబుల్‌ ‌బెడ్రూమ్‌, ‌రోడ్లు, లైట్లు, టాయిలెట్ల పైసలన్నీ కేంద్రానివేనన్నారు. అన్నీ కేంద్రం ఇస్తే కేసీఆర్‌ ఏమి చేస్తాడో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. బంగళాలు మునగలేదు కాబట్టే వరదల సమయంలో కేసీఆర్‌ ‌బయటకు రాలేదని సంజయ్‌ ఎద్దేవా చేశారు. నష్టంపై ఇంటింటికీ సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. తాము ఛత్రపతి శివాజీ వారసులమైతే లాడెన్‌, ‌బాబర్‌, అక్బర్‌ ‌వారసుడు కేసీఆర్‌ అని సంజయ్‌ ‌చెప్పారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్‌ను బొంద పెడతామని, హిందువులను అవమానిస్తున్న ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్తామని సంజయ్‌ ‌హెచ్చరించారు. పేదలకు కష్టమొచ్చినప్పుడు పరామర్శించక పోవడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని, రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ కేంద్రం నిధులు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు.ఇటీవల టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి రాజీనామా చేసిన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేపల్లి కార్పొరేటర్‌ ‌తోకల శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరారు.

హైదరాబాద్‌ను సర్వనాశనం చేసిన టిఆర్‌ఎస్‌ : ‌బిజెపి నేత లక్ష్మణ్‌
‌తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, అందుకు తగ్గట్లుగా నిధులు విడుదల చేస్తోందని, వరద బాధితులకు నిధులు మంజూరు చేసిందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ‌తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులపై చర్చకు తాను సిద్ధమన్నారు. సోమవారం ఢిల్లీలో లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి సముద్రం లేదన్న కోరికను తెలంగాణ ప్రభుత్వం తీర్చిందని ఎదేవా చేశారు. నగర రోడ్లు బాగుపడే వరకు టీఆర్‌ఎస్‌కు వోట్లు అడిగే అర్హత లేదన్నారు.  విశ్వనగరాన్ని మురికి నగరంగా మార్చారని, కేటీఆర్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కాదు.. వర్రియింగ్‌ ‌ప్రెసిడెంట్‌. ‌తండ్రి కొడుకులిద్దరూ కలిసి దోచుకుంటున్నారని, మజ్లిస్‌ ‌పార్టీతో మిలాఖత్‌ అయ్యి హైదరాబాద్‌ని నాశనం పట్టించారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటున్నదని, వివిధ రంగాల్లోక నిధులు కేటాయించిందని, వరద బాధితులకు కేంద్రం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. వరదబాధితులక కోసం వివిధ పనులకు గాను దాదాపు 500 కోట్ల వరకు విడుదల చేసిందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply