Take a fresh look at your lifestyle.

ఓపికగా ఉంటే తప్పకుండా అవకాశం ఇస్తాం

  • కూడవెళ్లి మండుటెండల్లో ప్రవహిస్తుందనీ కలలో కూడా అనుకోలేదు…
  • దేశానికి అన్నం పెట్టిన ఘనత టిఆర్‌ఎస్‌ ‌పార్టీదే
  • సాగుకు, తాగుకు ఏనాడైనా కాంగ్రెస్‌, ‌టిడిపోళ్లు నీళ్లిచ్చారా?
  • మిరుదొడ్డి ఏఎంసి పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీష్‌రావు సూటిప్రశ్న

ఓపికతో ఉన్న ప్రతి కార్యకర్తకు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ, ప్రభుత్వంలో తప్పకుండా అవకాశం ఇస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డిలో మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ(ఏఎంసి) నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…ఎవరికైనా ఓపిక అవసరం అన్నారు. ఓపిక ఉంటే అన్ని అవకాశాలు వొస్తాయన్నారు. రాష్ట్రాన్ని 70 యేండ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌, ‌టిడిపి పార్టీలకు చెందిన పాలకులు ఏనాడైనా ఈ ప్రాంతానికి సాగుకు, తాగుకు నీళ్లిచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం ఏర్పడి సిఎంగా కేసీఆర్‌ అయ్యాక సాగుకు, తాగుకు కాళే•శ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లందిస్తున్నామనీ, తద్వారా భూమికి బరువయ్యేంతగా పంటలు పండించేందుకు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.

అంతేకాదూ, ఈ దేశానికి అన్నం పెట్టిన ఘనత కూడా టిఆర్‌ఎస్‌ ‌పార్టీదేననీ అన్నారు. మండుటెండల్లో కూడవెల్లి వాగు ప్రవహిస్తుందని కలలో కూడా అనుకోలేదనీ, కానీ సిఎం కేసీఆర్‌ ‌కృషి వల్ల ఈయేడు వేసవి కాలంలో భగభగ మండే మండుటెండల్లోనూ ఈ ప్రాంతంలోని కూడవెళ్లి వాగు ప్రవహించిందనీ, వేలాది ఎకరాలలో వరిచేనుకు నీళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం, సిఎం కేసీఆర్‌ ‌కృషి వల్ల ఈ ఎండాకాలంలోనూ ఈ ప్రాంతలోనూ వేలాది ఎకరాలలో వరిపంటకు నీరిచ్చి వడ్లు పండేలా చేశామన్నారు. బీహార్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌రాష్ట్రాల నుంచి వొచ్చి వ్యవసాయ పనులు చేసే పరిస్థితికి తెలంగాణ చేరుకుందన్నారు. ధాన్యం పండించడంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌, ‌హర్యానా రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో 40 మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం నిల్వ ఉంచేలా గోదాముల కట్టిస్తామనీ, దుబ్బాక నియోజకవర్గంలో 15 రోజుల్లో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాల్స్ ‌పూర్తి చేసేలా నిధులు విడుదల చేస్తామన్నారు.

ఈ కొరోనా సమయంలో కూడా రైతుకు కొండంత అండగా ఉంది టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం ఉందనీ, వాన చినుకు భూమిపై పడకముందే రైతు బంధు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేననీ అన్నారు. అవసరమైతే మిగతా పనులు ఆపుతాం, కానీ రైతుకు మాత్రం అన్నీ సరైన సమయంలో అందిస్తామన్నారు. వెద జల్లే పద్ధతిలో వరి సాగు, ఆయిల్‌ ‌పామ్‌, ‌పామాయిల్‌ ‌తోటలు పెట్టి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు మంత్రి హరీష్‌రావు సూచించారు. వరి వెదసాగు పద్దతిని ప్రోత్సాహించాలని రైతులను కోరారు. కంది, పత్తి సాగును ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేయాలనీ, త్వరలో పేదలకు కొత్త రేషన్‌ ‌కార్డులు పంపిణీ చేస్తామనీ, నాయిబ్రాహ్మణ, రజకులకు కరెంటు ఫ్రీ తోపాటు సబ్సిడీ ఇస్తామన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మెదక్‌ ఎం‌పి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాక్రిష్ణశర్మ, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు వేలేటి రాధాక్రిష్ణశర్మ, బక్కి వెంకటయ్య, రొట్టె రాజమౌళితో పాటు స్థానిక టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply