Take a fresh look at your lifestyle.

తాళ చెరువును మినీ ట్యాంకు బండ్‌గా మారుస్తాం: వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి, ఆగస్టు,24 (ప్రజాతంత్ర విలేకరి):  తాళ చెరువును మినీ ట్యాంకుబండ్‌గా మారుస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం రోజు తాళ చెరువును అలుగుపారుతున్న సందర్భంగా పూజలు చేశారు. ఈ సందర్భఞగా మంత్రి మాట్లాడుతు గతంలో తీసుకున్న చర్యల మూలంగా 11ఏండ్ల తరువాత చెరువు అలుగుపారుతుందని గత రెండేళ్లుగా నల్ల చెరువు ఈదుల చెరువు కృష్ణమ్మ నీళ్లతో అలుగుపారుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది కృష్ణా నీళ్లకు తోడు వర్షాలు కురవడంతో చెరువులు అలుగులుపారుతున్నాయని తాళ చెరువు చుట్టు ప్రహరి నిర్మిస్తామని ఆక్రమణలను తొలగించి ఆహ్లాదకరంగా మారుస్తామని చెప్పారు.

అలాగే 22 వ వార్డులో పర్యటించి కంప చెట్లను తొలగించాలని మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రి తన నివాసంలో సమస్యలపై వార్డుల వారిగా వచ్చిన సమాచారం సంబంధిత అధికారులకు చేరవేయాలని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. త్రాగునీరు కరెంటు సమస్యలు వెంటనే పరిష్కరించాలని వార్డులో మురికి కాలువలు శుభ్రంచేయించాలని అన్నారు. సమస్యలపై నిరంతరం సమీక్షలు ఏర్పాటు చేసుకొని పరిష్కరించుకోవాలని లక్ష్మీనరసింహ కాలనీలో కరెంటు సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అన్నారు. పలు సమస్యలపై అధికారులకు కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply