Take a fresh look at your lifestyle.

పబ్లిక్‌ ‌పరీక్షలు నిర్వహించి తీరుతాం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేశ్‌

కోవిడ్‌ ‌కారణంగానే వాయిదా వేశాం
విపక్షాల రద్దు డిమాండ్‌ ‌సరికాదన్న మంత్రి సురేశ్‌
రాజమండ్రి,జూన్‌ 5 : ‌టెన్త్ ‌పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ‌మరోమారు స్పష్టం చేశారు. పరీక్షలను వాయిదా వేశామే తప్ప రద్దు చేయలేదన్నారు. పరిస్థితులు చక్కబడగానే పూర్తి రక్షణతో తిరిగి పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. శనివారం ఆయన డియాతో మాట్లాడుతూ, పరిస్థితులు అనుకూలిస్తే టెన్త్ ‌పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ ‌పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌ ‌సరికాదన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు టెన్త్ ‌ప్రామాణికమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

విద్యార్థుల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భాద్యత వహిస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ‌స్పష్టం చేశారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించి యువత హరిత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌ ‌విజృంభిస్తున్న నేఫథ్యంలో ప్రజల అభిప్రాయం మేరకు 10వ తరగతి,ఇంటర్‌ ‌పరీక్షలను వాయిదా వేశామని తెలిపారు. కొవిడ్‌ ‌తగ్గుముఖం పట్టిన తర్వాత పరీక్షలు నిర్వహించి తీరుతామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవ్వరూ పరీక్షలను రద్దు చేయాలని కోరుకోవడం లేదన్నారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయాలు చేయడం కోసమే పరీక్షలపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని మంత్రి సురేష్‌ ‌విమర్శించారు.

Leave a Reply