Take a fresh look at your lifestyle.

కొలువుల కోసం నిరుద్యోగులతో హైదరాబాద్‌ ‌ను దిగ్బంధిస్తాం

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌
‌హైదరాబాద్‌ ,ఆగస్టు 2: నాచారం లో బోనాల పండుగ సందర్భంగా ఆదివారం ప్రొఫెసర్‌ ‌కోదండరాం అమ్మవారిని దర్శించుకున్నారు… ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు రావని ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, త్వరలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం పై యుద్ధం ప్రకటిస్తామని నిరుద్యోగులతో హైదరాబాద్‌ ‌ను దిగ్బంధం చేస్తామని అన్నారు.దిగ్బంధం విజయవంతం కావాకాని అమ్మవారి ని మొక్కుకున్నాను.. అమ్మవారి అనుగ్రహం దయ నిరుద్యోగులపైన ఉండాలని బోనాల పండుగ అంటేనే అందరు సంతోషంగా ఉండాలి చుట్టాలను,బంధువులను ఇంటికి పిలుచుకొని అమ్మవారి కి మొక్కులు చెల్లించుకొని సంతోషంగా ఈ రోజు గడుపుతాము,కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిరుద్యోగుల పరిస్థితి ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ రోజు అమ్మవారి ఆలయం నుండి సమరశంఖం పురిస్తున్నామని,లక్షలాది నిరుద్యోగులతో హైదరాబాద్‌ ‌లో శక్తి ప్రదర్శన చేస్తామని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమ స్పూర్తితో సాగరహారం ,సకలజనుల బేరి మాదిరిగా నిరుద్యోగులు యువకులు విద్యార్థులు ఉపాది కోల్పోయిన వాళ్ళ తో హైదరాబాద్‌ ‌కు తరలిస్తామని.. ప్రభుత్వం తో తాడోపేడో తేల్చుకుంటామని.. రాష్ట్రంలో ఖాలీ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు తగ్గించే కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇటీవల PRC కి వేసిన బిస్వాల్‌ ‌కమిటీ 1 లక్ష 91 వెయి 126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు,రాష్ట్రంలో 50 వేళ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని మళ్ళీ నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు, 50 వేళ మందిని ఉద్యోగాల నుండి తొలగించారు,అంటే రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 80 వేళ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌కు చట్టబద్ధత కల్పించాలని, కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు., నిరుద్యోగులారా ఆత్మహత్యలు చేసుకోవద్దు.. కనిపెంచిన తల్లిదండ్రులకు దుఖః మిగుల్చవద్దు.. ఈ ప్రభుత్వం పై త్వరలో హైదరాబాద్‌ ‌లో యుద్ధం ప్రకటిద్దాం.. అమ్మవారి అనుగ్రహం మనపైన ఉంటుంది మన ఉద్యోగాలు సాదిద్దాం అని ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్‌,‌స్టూడెంట్‌ ‌వింగ్‌ ‌స్టేట్‌ ‌ప్రెసిడెంట్‌ ‌నిజ్జన రమేష్‌ ‌ముదిరాజ్‌, ‌యువత విభాగం, సయ్యద్‌ ‌సలీం పాషా, విద్యార్థి నాయకులు, సర్దార్‌ ‌వినోద్‌ ‌కుమార్‌, ‌బాబు మహాజన్‌,అరుణ్‌ ‌కుమార్‌ ‌లు పాల్గొన్నారు..

Leave a Reply