Take a fresh look at your lifestyle.

కృష్ణా జలవివాదంలో.. చట్టపరమైన ముగింపు కోరుకుంటున్నాం: చీఫ్‌ ‌జస్టిస్‌

‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనానికి స్పష్టం చేసిన ఎపి ప్రభుత్వం
వివాదాన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేసిన చీఫ్‌ ‌జస్టిస్‌
న్యూఢిల్లీ, ఆగస్ట్ 4 : ‌తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడపై చట్టపరమైన ముగింపు కావాలని ఎపి కోరుకుంటున్న క్రమంలో వివాదాన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. కృష్ణా జలాల వివాదంలో ఏపీ పిటిషన్‌పై సుప్రీమ్‌ ‌కోర్టులో బుధవారం విచారణ జరిగింది. తెలంగాణకు వ్యతిరేకంగా జగన్‌ ‌సర్కార్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. పిటిషన్‌పై సీజేఐ ఎన్వీ రమణ విచారణ చేపట్టారు. సోమవారం నాడు జరిగిన విచారణలో ఈ వివాదానికి మధ్యవర్తిత్వమే మంచిదని రమణ చెప్పిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. తాము న్యాయపరంగానే సమస్యకు పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఏపీ తరపు న్యాయవాది దుష్యంత్‌ ‌దవే కోర్టుకు తెలిపారు. మరోవైపు.. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రం చెప్పింది. అయితే..కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సీజేఐ ఎన్వీ రమణ తోసిపుచ్చారు. అనంతరం ఈ కేసును మరో ధర్మాసనానికి రమణ బదిలీ చేశారు.

మధ్యవర్తిత్వం కుదరదంటే ఈ పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తానని ముందుగా చెప్పినట్లే బుధవారం నాడు రమణ బదిలీ చేసేశారు. అంతేకాదు..ధర్మాసనమే విచారించాలని ఏపీ, కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ రమణ తోసిపుచ్చారు. అయితే.. ఈ కేసు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది..? ఎప్పుడు విచారణకు వొస్తుంది..? విచారణ అనంతరం తీర్పు ఎలా ఉంటుందనే దానిపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా..కృష్ణా ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుదుత్పత్తి చేస్తుందని, అపెక్స్ ‌కౌన్సిల్‌ ఆదేశాలను ఉల్లంఘిస్తుందని ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే.

జల వివాదాలను సామరస్యంగా తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని, చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించు కోవొచ్చేమో, దయచేసి పరిశీలించండని సోమవారం సిజె జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించారు. అవసరమైతే ఇందుకు సుప్రీమ్‌ ‌కోర్టు కూడా సహకరిస్తుందన్నారు. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం, జగన్‌ ‌సర్కార్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తుందని..ఇంత జరుగుతున్నా జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది పోయి తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తుందని కేసీఆర్‌ ఆ‌గ్రహించారు. రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృష్ణా జలాల వివాదంపై చర్యలు చేపడుతామని కెసిఆర్‌ ‌చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇప్పుడు సుప్రీమ్‌ ‌ధర్మాసనం సూచనలను ఎపి తిరస్కరించడంతో ఇక సుదీర్ఘ కాలం ఈ సమస్య కొనసాగనుంది.

Leave a Reply