- వారి విద్యా,వైద్య ఖర్చులను కేంద్రం భరిస్తుంది
- పేదలకు నిత్యాసరాలు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి
కొరోనా తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వారికి చదువు, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు అంతా కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. సేవా హీ సంఘటనలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆశా వర్కర్లు, జీహెచ్ఎంసీ కార్మికులకు నిత్యావసర వస్తువులు కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రధానిగా నరేంద్ర మోదీ 7 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. వారం రోజుల పాటు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తామని తెలిపారు. కొరోనాతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని… కనిపించని శత్రువుతో ప్రజలు పోరాటం చేస్తున్నారన్నారు.
కొరోనా కట్టడికి కావలసిన అన్ని చర్యలు కేంద్రం చేపట్టిందని చెప్పారు. 11 కంపెనీలో బ్లాక్ ఫంగస్‌కు కావాల్సిన ఇంజెక్షన్లను ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. డిసెంబర్ నాటికి అందరికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. టీకాలు అందేవరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదన్నారు. విద్యార్థుల మధ్యాహ్నం భోజనం పతాకానికి అయ్యే ఖర్చు వారి ఖాతాలో జమ చేసేందుకు నిర్ణయం తీసుకుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
లాక్ డౌన్ సడలింపు అంశం ప్రభుత్వ పరిధిలోనిదని స్పష్టం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయాన్ని పెంచడంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల వి•దకొస్తున్నారన్నారు. అనవసరంగా రోడ్ల వి•దకు వచ్చి ప్రజలు కొరోనా బారిన పడొద్దని సూచించారు. దేశంలో కొరోనా తగ్గుముఖం పడ్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.ప్రభుత్వ హాస్పట ల్లో బెడ్స్ ఖాళీగా ఉన్నాయన్నారు. కొరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న హాస్పటపై నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వానిదే అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు