నాగర్కర్నూల్,సెప్టెంబర్ 8.ప్రజాతంత్రవిలేకరి: మత్స్యకారులకు ఎల్లప్పుడు అండగా మేముంటామని మరియు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దకొత్తపల్లి మండల జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య,మారెడు మాన్ దిన్నె సర్పంచ్ గన్నోజు సునితశ్రీకృష్ణచారి, చంద్ర బండతాండ సర్పంచ్ రాంలాల్ నాయక్ అన్నారు. మంగళవారం పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని మారెడు మాన్ దిన్నె గ్రామంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన 69 వేల చేపపిల్లలను గ్రామ మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులతో కలిసి మొగుళ్ళ చెరువు, వేడుకరావుపల్లి కడదలు, మారొల్లమైసమ్మ డ్యాం లలో వదిలారు.
ఈసందర్భంగా జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య,మారెడు మాన్ దిన్నె సర్పంచ్ గన్నోజు సునితశ్రీకృష్ణ చారి,చంద్రబండతాండ సర్పంచ్ రాంలాల్ నాయక్,టిఆర్ఎస్ నాయకులు చంద్రయ్య యాదవ్, వెంకటస్వామి గౌడ్, అమృనాయక్, శ్రీ హరిరావ్లు మాట్లాడుతూ గ్రామంలోని మత్స్యకారు ల అభివృద్ధికి ఎల్లవేళల అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత గానో కృషి చేస్తున్నట్లు వివరించారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ద్విచక్ర వాహనాలు,వ్యానులు మరియు ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా మత్స్యకారుల అభివృద్ధితో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుం దని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు,టిఆర్ఎస్ నాయకులు దస్తగిరి యాదవ్, గ్రామ మత్స్య సహకార సంఘం సభ్యులు పెబ్బేటి రేణయ్య, సందు జగన్ మోహన్,వంకేశ్వరం మహేష్, పెబ్బేటి ఎల్లయ్య,చిన్న నరసింహ, బక్కయ్య, వంకేశ్వరం రాజు, సందు యాదగిరి,సొప్పరి నరసింహ,బయ్య నిరంజన్, పెబ్బేటి కురుమయ్య, కర్నాకర్, వెంకటస్వామి,వెంకటయ్య, సొప్పరి బాలపీరు,గడ్డిగోపుల ఈశ్వరయ్య, అరిగెలబాలస్వామి తదితరులు పాల్గొన్నారు.