- రైతులపై లాఠీ ఛార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం
- వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం టీ -కాంగ్ నేతలు
ఢిల్లీ కేంద్రంగా వ్యవసాయ వ్యతిరేక బిల్లులపై పోరాటం చేస్తున్న రైతుల పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలుపుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులపై చేసిన లాఠీచార్జిను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. సోమవారం గాంధీభవన్‌లో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ …వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెప్పారని సన్నాలు వేశారు కానీ ఈ రోజు కొనే పరిస్థితి లేదని, అయితే ప్రతీ గింజను కొనే వరకు కాంగ్రెస్ ఒత్తిడి తెస్తుందన్నారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉంటే అసద్ లెటర్ రాస్తే చర్యలు తీసుకుంటామని అమిత్ షా చెబుతున్నారని. ఆ మాటలు దేనికి సంకేతమని, ఎంపీ , రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ చెస్తామంటూన్నారని ఇది ప్రజలు గమనించాలన్నారు. ప్రతీ రాజకీయ పార్టీ నేతలపై కేంద్ర సంస్థలు రైడ్స్ చేస్తుంటే కేసీఆర్ మీద ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.