Take a fresh look at your lifestyle.

మా గోదాముల్లో మా పంటలే నిల్వచేయాలి

కారేపల్లి, ఏప్రియల్‌ 30, (‌ప్రజాతంత్ర విలేకరి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి పంటను నిల్వ చేసుకునేందుకు ప్రతి మండలకేంద్రంలో లక్షలు ఖర్చు ధాన్యం నిల్వ గిడ్డంగు)ను నిర్మించారు. అదే సమయంలో సింగరేణి మండలం అప్పాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గిడ్డంగి నిర్మాణం జరిగింది. ఈ గిడ్డంగిలో మండల పరిధిలోని రైతులు పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం వారు అవకాశం కల్పించారు. కానీ అందుకు భిన్నంగా ఇతర మండలాల నుండి ధాన్యం తీసుకవచ్చి ఈ గిడ్డంగిలో నిల్వచేస్తున్నారు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ ‌కారణంగా ప్రభుత్వం వారు రైతులు పండించిన పంటల కొనుగోలు కేంద్రం విశాల సహకార పరపతి సంఘం ద్వారా ఏర్పాటుచేసారు. ఈ సంఘం వారు కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడో దూరప్రాంతంలో ఖాళీగా ఉన్న ధాన్యం గోదాముకు తరలిస్తున్నారు. అందుకు ప్రబుత్వం వారికి రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. లారీలు కిరాయిలకు లభించక పంట పండించిన రైతులు ధాన్యం కొనుగోలుదారులు రోజుల తరబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దనే ఉంచాల్సి వస్తుంది.

అందువల్ల మండలంలోని రైతులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. బుదవారం రాత్రి కురిసిన అకాలవర్షం వల్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొత్తం తడిసి రైతులు, కొనుగోలుదారులు చాలా నష్టపోయారు. మండల కేంద్రంలో ధాన్యం గిడ్డంగి ఉన్నా స్తానిక రైతులకు ఉపయోగపడటం లేదు. ఈ సందర్బంగా మండలంలోని రైతులందరూ తాము పండించిన పంటను తమ మండల పరిధిలోని గిడ్డంగిలోనే నిల్వ చేయాలని గిడ్డంగి వద్దనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

Leave a Reply