Take a fresh look at your lifestyle.

ఆడపిల్లను రక్షించుకుందాం.. సృష్టిని కాపాడుకుందాం.!

“వివక్ష లేని సమాజం కావాలని ప్రపంచ వ్యాప్తంగా బాలికల పై  జరుగుతున్న లైంగిక హింసను అరికట్టాలని సమాజహితం కోసం ప్రభుత్వాలు కొత్త చట్టాలు అందరికీ అందుబాటులో  తెచ్చినప్పటికి, ఆచరణకు నోచుకోక మహిళాలోకం నిరంతరం ఉద్యమాలతో, అక్కడ ఉండే వాతావరణంలో పురుషాధిక్యానికి బలి కాక తప్పడంలేదు. దీనికి ప్రధాన కారణం విద్యా నైపుణ్యాలు అందరికీ సమానంగా అందుబాటులో లేకపోవదం. మహిళలను ఆట వస్తువులా చూడడంతో ఇలాంటి సమస్యలు ఏదుర్కోక తప్పడంలేదు. ప్రపంచంలో దశాబ్దాలుగా మహిళలు సమాజంలో  గుర్తింపుకోసం పరితపిస్తున్నారు.”

నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం..

మా ఇంటిలోనా మహలక్ష్మి నీవే అని చెప్పడంతో పాటు బాలికలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వారి హక్కులను పరిరక్షించాలి అటూ గొప్పగా ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ఆచరణలో సాధ్యం కావలి,,అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. వారి హక్కులు దోపిడికి గురికావడమే కాక, కనీస గుర్తింపు, గౌరవానికి నోచుకోవడంలేదు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు, అనర్థాలను నివారించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. అప్పట్లో ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని భావించేవారు. ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టడమే భారమని భావిస్తున్నారు. కడుపులోనే ఆడపిల్లను చంపేస్తున్నారు. ఒకవేళ పుట్టినా నిమిషాల్లో అమ్మేస్తున్నారు. అది కూడా కాదు అనుకుంటే ఏ చేత్తకుప్పల్లోనో, పొదల్లోనో వదిలేస్తున్నారు. అసలు ఏం పాపం చేసారని వారికి ఈ శిక్ష..ఇవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది బాలికలు ఎన్నో సమస్యలను, సవాళ్ళను ఎదురుకుంటున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు,  ప్రపంచానికి తెలియజేసేలా ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకూ అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రతీ ఏడాది అక్టోబర్‌ 11‌న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఈమేరకు డిసెంబర్‌ 19‌న 2011లో ప్రకటించడం జరిగింది.

వివక్ష లేని సమాజం కావాలని ప్రపంచ వ్యాప్తంగా బాలికల పై  జరుగుతున్న లైంగిక హింసను అరికట్టాలని సమాజహితం కోసం ప్రభుత్వాలు కొత్త చట్టాలు అందరికీ అందుబాటులో  తెచ్చినప్పటికి, ఆచరణకు నోచుకోక మహిళాలోకం నిరంతరం ఉద్యమాలతో, అక్కడ ఉండే వాతావరణంలో పురుషాధిక్యానికి బలి కాక తప్పడంలేదు. దీనికి ప్రధాన కారణం విద్యా నైపుణ్యాలు అందరికీ సమానంగా అందుబాటులో లేకపోవదం. మహిళలను ఆట వస్తువులా చూడడంతో ఇలాంటి సమస్యలు ఏదుర్కోక తప్పడంలేదు. ప్రపంచంలో దశాబ్దాలుగా మహిళలు సమాజంలో  గుర్తింపుకోసం పరితపిస్తున్నారు. ఈ నేపథ్యంలో  దేశంలో జరుగుచున్న అనేక  సంఘటనలతో ఆడపిల్లలకు రక్షణ కరువై ఎన్నో అఘాయిత్యాలకు బలికావడం కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాం. తెల్లారితే న్యూస్‌లో ఏమి చాడాల్సి వస్తుందో అనే భయానక వాతవరణంతో బిక్కు,బిక్కుమంటూ కాలం గడుపాల్సిన పరిస్థితి దాపురించింది.

2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతీ వెయ్యి మంది పురుషులకు 940 మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు తేలింది. అలాగే ఆరు సంవత్సరాల లోపు ఆడ పిల్లలైతే ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 914 మంది మాత్రమే ఉన్నట్లు జనాభా లెక్కల్లో వెలుగు చూసింది. అక్షరాస్యత శాతంను చూస్తే మహిళల అక్షరాస్యత శాతం 68.4 శాతంగా ఉంది. బాల్య వివాహాలు భారత దేశంలో అధికంగా అవుతున్నాయి. 26.8 శాతం మంది బాలికలకు బలవంతంగా వివాహాలు చేస్తున్నారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 40 శాతం బాల్య వివాహాలు అవుతున్నాయి. 2018లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందిబాలురకు 925 మంది బాలికలున్నారు. 2019లో బాలికల నిష్పత్తి 930కి పెరిగింది. 2016లో బాలికల నిష్పత్తి 881గా ఉండగా నెమ్మదిగా మెరుగుపడుతూ వస్తోంది. ఈ-బర్త్ ‌పోర్టల్‌ ‌తొలిసారిగా పూర్తిస్థాయిలో వెలువరించిన డాటా ప్రకారం.. 2019 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు రాష్ట్రంలో 4,91,916 మంది శిశువులు జన్మించారు. ఇందులో 2,57,731 మంది మగపిల్లలు, 2,39,716 మంది ఆడపిల్లలున్నారు. 52 శాతం మగపిల్లలు, 48 శాతం ఆడపిల్లలున్నారు. పురిట్లోనే 484 మంది శిశువులు మరణించారు. శాస్త్రీయ సాహిత్యం తరచుగా మగవారి నిష్పత్తిని ఉపయోగిస్తుంది.

అందులో బాగంగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఒక గంటకు 18750 మంది శిశువులు జన్మిస్తున్నారనేది, జననాల వివరాలను ఈ-బర్త్ ‌పోర్టల్‌ ‌ద్వారా వెల్లడించడం వల్ల తెలుస్తుంది. రాష్ట్రంలో హాస్పిటళ్లలో జన్మించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అందులో సర్కారు హాస్పిటళ్లలో 57 శాతం, ప్రైవేటులో 43 శాతం జననాలు నమోదవుతున్నాయి. శిశువు పుట్టగానే హాస్పిటల్‌లోలోనే ఈ-బర్త్ ‌పోర్టల్‌ ‌ద్వారా ఆ వివరాలను అదేరోజు ఆన్లైన్‌ ‌చేస్తున్నారు. దీని ద్వారా శిశువు, జనన, మరణాల గణాంకాలు త్వరితగతిన తీసుకోవడానికి సాధ్యం అవుతుంది.
మహిళలపై లైంగిక హింస భారతదేశంలో విస్తృతంగా ఉంది. నేషనల్‌ ‌క్రైమ్‌ ‌రికార్డస్ ‌బ్యూరో(ఎన్సిఆర్బి) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, భారతదేశంలో 2019 లో ప్రతిరోజూ 88 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వాయువ్య రాష్ట్రమైన రాజస్థాన్లో 2019 లో దాదాపు 6,000 అత్యాచార కేసులు నమోదయ్యాయి, ఉత్తరప్రదేశ్‌ 3,065 ‌కేసులు నమోదైంది. అత్యాచారానికి గురైన మహిళల్లో కొంత భాగం మాత్రమే ఫిర్యాదు చేస్తారు. అత్యాచారానికి సంబంధించిన సామాజిక కళంకం కారణంగా చాలా మంది బాధితులు మౌనంగా ఉండటానికి ఇష్టపడతారు. బాధితురాలిని నిందించడం లేదా ఆమె పాత్రపై ఆకాంక్షించడం అసాధారణం కాదు.

తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రతే ముఖ్య లక్ష్యంగా ‘‘షి టీమ్స్’’ ఏర్పాటు చేయడం, బాలికల రక్షణ కోసం నేరస్తుల కదలికలను రికార్డు చేయటానికి వీరికి చిన్న కెమెరాలను అందించారు. బస్‌ ‌స్టాపులు, సినిమా హాళ్ళు, పార్కుల వంటి పబ్లిక్‌ ‌ప్రాంతాలలో ఈవ్‌ ‌టీసింగ్‌ ‌చేసే వారిని, అనుమానితులను గుర్తించి వారిని సిసిఎస్‌(‌సెంట్రల్‌ ‌క్రైం స్టేషన్‌) ‌కు తీసుకువెళ్తారు. వీరికి పోలీస్‌ ‌స్టేషన్లో కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యున్నత స్థాయి కౌన్సిలింగ్‌  ఇవ్వబడుతుంది. నిందితులకు సంబంధించిన వివరాలు సెంట్రల్‌ ‌డేటాబేస్‌లో గోప్యంగా ఉంచి వారి రోజువారీ కార్యకలాపాల మీద నిఘా ఉంచుతారు. మళ్ళీ మళ్ళీ అతని మీద ఫిర్యాదులు వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటారు. బాధితుల పేరు మరియు ఇతర వివరాలు రహస్యంగా ఉంచుతారు. ‘‘షి టీమ్స్’’ ‌ద్వారా అరెస్టైనవారి గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో యాంటీ ర్యాగింగ్‌ ‌చట్టం మరియు తమిళనాడులో ఈవ్‌ ‌టీసింగ్‌ ‌నిషేధ  చట్టం వంటివి తెలంగాణాలో ఏర్పాటు చేయాలని ‘‘షి టీమ్స్’’ ‌తెలంగాణా ప్రభుత్వానికి సూచించింది.  తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ ‌పోలీసువారిచే ఏర్పాటు చేయబడిన ‘‘షి టీమ్స్’’  ‌భారతదేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నేషనల్‌ ‌గర్లస్ ‌డెవలప్‌మెంట్‌ ‌మిషన్‌ ‌పేరుతో  ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఆడపిల్లల పట్ల వివక్షను అంతం చేసి లింగ అసమానతలను రూపుమాపాలనే నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించారు. ఇందుకోసం మోడీ బేటీ బచావో.. బేటీ పఢావో పిలుపునిచ్చారు. ఆడ పిల్లలకు ప్రత్యేక ఖాతాలు తెరవడం వల్ల ఆర్థిక సాధికారత లభిస్తుందని, తద్వారా వారిని మగ పిల్లలతో సమానంగా సంరక్షించేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో చేసే డిపాజిట్లపై వడ్డీరేటును ప్రభుత్వం 8.1 శాతంగా నిర్ణయించింది. అంతే కాదు ఈ ఖాతాలో జమ చేసుకున్న సొమ్ముకు ఆదాయపన్ను మినాహాయింపు కూడా ఉంది. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు. తపాలా కార్యాలయాల్లో కానీ, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ వెయ్యి రూపాయాల కనీస డిపాజిట్తో పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవవచ్చు. ఒక వార్షిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకు జమ చేసుకునేందుకు వీలుంది.

ఇటీవల ఆడపిల్లలకు సమాన వాటా కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్‌కోర్టు తీర్పు చెప్పింది. కుమారులతో, కుమార్తెలకు సమానహక్కు ఉంటుందని స్పష్టం చేయడంతో మహిళలు కోరుకున్న లింగ విభేదాలు లేని సమానమైన గౌరవం లభించిందని మహిళా లోకం హర్షం వ్యక్తం చేసారు.
డా।। సంగని మల్లేశ్వర్‌
‌జర్నలిజం విభాగాధిపతి, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌,  9866255355

Leave a Reply