Take a fresh look at your lifestyle.

నీటి అక్రమ తరలింపును అడ్డుకుంటాం

  • పోతిరెడ్డిపాడు విస్తరణను అంగీకరించేది లేదు
  • అపెక్స్ ‌కమిటీ తీర్మానం లేకుండా కొత్త ప్రాజెక్టులకు అనుమతి లేదు
  • సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం
  • ఎపి సర్కార్‌ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు

నీటి వాటాలపై రాష్ట్ర పునర్‌ ‌వ్యవస్థీకరణ బిల్లులో స్పష్టంగా ఉందని, కృష్ణానదీ పరివాహక ప్రాంతాల అవసరాలు తీరందే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే హక్కు ఆంధ్రకు ఎవరిచ్చారని మంత్రి హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. కృష్ణాజలాలపై ఎపికి 512 టిఎంసిల వాటా ఎక్కడిదని ఆయన నిలదీశారు. పోతిరెడ్డిపాడుకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ 44 ‌వేల క్యూసెక్కుల నీటిని తరలించినప్పుడే నిరసనగా టిఆర్‌ఎస్‌ ‌శాసనసభ్యులం రాజీనామాలు చేశామన్నారు. ఇప్పుడు రోజుకు 3టిఎంసి తరలిస్తామంటే తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. కొత్తగా నీటిని వినియోగంలోకి తీసుకురావాలం టే అపెక్స్ ‌కమిటీలో చర్చించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి చర్చలు లేకుండా అక్రమంగా శ్రీశైలం నుంచి ఆంధ్ర రోజుకు 80వేల క్యూసెక్కుల నీటి ని తరలించుకుపోతే తెలంగాణలోని కృష్ణాపరివాహక ప్రాంతాల పరిస్థితి ఏమిటీ, కృష్ణానదీపై ఆధారపడిన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటని ఆయన ఆంధ్రను ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ ‌నీటి ప్రయోజనాలు దెబ్బతీస్తే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర సర్కార్‌ అ‌క్రమంగా నీటిని తరలిస్తే మహబూబ్‌నగర్‌ ‌ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాంతాల ప్రాజెక్టులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డి పాడు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌సామర్థం పెంచితే తెలంగాణ జల ప్రయోజనాలకు తీరని నష్టం ఏర్పడుతుందని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ నీటి ప్రాజెక్టులకు కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అయితే ఎట్టిపరిస్థితులోనూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఈ ‌ప్రాజెక్టును అడ్డుకుంటారని ప్రజల ఆందోళన పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం ముందు మహారాష్ట్ర ప్రభుత్వంతో దశలవారిగా చర్చలు జరిపి ఆ రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా నిర్మాణ పనులు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే సిఎం జగన్‌ ‌తెంలగాణతో స్నేహంగా ఉంటూనే ఎలాంటి సంప్రదింపులు లేకుండా తెలంగాణకు చెందిన నీటి వాటాలను గండికొడుతూ ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పారు.

బ్రిజేష్‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌లో న్యాయ లభించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందాల్సిన కృష్ణా, గోదావరిలోని నీటి చుక్కను ఆంధ్ర ప్రదేశ్‌ అ‌క్రమంగా తరలించినా సహించే ప్రసక్తే లేదని ప్రభుత్వ విప్‌ ‌కర్నెప్రభాకర్‌ ‌హెచ్చరించారు. తెలంగాణ పోరాటంలో నీటి వాటాల అంశం ప్రధాన భూమిక పోషించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం మాప్రాజెక్టులు మేము నిర్మించుకుంటూ రాష్ట్రాన్నిఅభివృద్ధి చేసుకుంటుంటే తిరిగి ఆంధ్ర జల దోపిడికి ప్రయత్నిస్తే ప్రజలు సహించరని ఆయన ఘాటుగా స్పందించారు. బ్రిజేష్‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌తక్ష ణం స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి శ్రీశైలం నీటిని తరలించేందుకు ఆంధ్ర పన్నిన కుట్రను అడ్డుకుంటామని చెప్పారు. అక్రమంగా నీటిని ఆంధ్ర తరలిస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అనవసరమైన రాజకీయాలతో బిజెపి, కాంగ్రెస్‌ ‌లబ్ది పొందాలనే కుటిల ప్రయత్నాలను మానుకోవాలని హితవు చెప్పారు.

ఏపీ ప్రభుత్వ జీవో 203పై ఫిర్యాదు
కృష్ణాబోర్డు ఇన్‌చార్జ్ ‌చైర్మన్‌ ‌చంద్రశేఖర్‌తో రజత్‌ ‌కుమార్‌ ‌భేటీ
కృష్ణా బోర్డు ఇన్‌చార్జ్ ‌చైర్మన్‌ ‌చంద్రశేఖర్‌ అయ్యర్‌తో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ ‌భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203పై ఫిర్యాదు చేశారు. ఏపీ కొత్త ప్రతిపాదనల వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపై వివరణ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203పై ఫిర్యాదుపాటు న్యాయపరంగా పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, రాలయసీమ లిప్టు ప్రాజెక్టు నిర్మాణాలు అక్రమమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. విభజన చట్టానికి విరుద్ధంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఏపీ పూనుకుంటోందని కృష్టా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల కారణంగా తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపింది. ఎపి నిర్మించతలపెట్టిన కొత్త ప్రాజెక్టులు ఆపాలని కృష్ణా రివర్‌ ‌బోర్డుకు లేఖ రాసినట్లు రజత్‌ ‌కుమార్‌ ‌చెప్పారు. టెలిమెట్రి విధానం అమలు చేయాలని కోరినా కృష్ణా రివర్‌ ‌బోర్డు పట్టించుకోలేదని అన్నారు. అపెక్స్ ‌కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు విస్తరణ పనులు ఎలా చేపడుతుందని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 203 జీవో సరైందికాదన్నారు. నేపథ్యంలో బుధవారం కేఆర్‌ఎం‌బీ ఛైర్మన్‌ను కలిసి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు రజత్‌ ‌కుమార్‌ ‌చెప్పారు. మ్యూచువల్‌ అ‌గ్రిమెంట్‌ ‌ప్రకారం 203 జీవో లేదన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ఏపీ ప్రారంభిస్తే మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీటి సమస్య ఏర్పడుతుందన్నారు. దీంతో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కృష్ణా రివర్‌ ‌బోర్డుకు లేఖ రాసినట్లు చెప్పారు. అలాగే కేఆర్‌ఎం‌బీ ఛైర్మన్‌ను కలిసి అన్ని విషయాలు వివరిస్తామని రజిత్‌ ‌కుమార్‌ ‌స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply