Take a fresh look at your lifestyle.

నీటి అక్రమ తరలింపును అడ్డుకుంటాం

  • అపెక్స్ ‌కమిటీ తీర్మానం లేకుండా కొత్త ప్రాజెక్టులకు అనుమతి లేదు
  • సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం మంత్రి హరీష్‌ ‌రావు 

నీటి వాటాలపై రాష్ట్ పునర్‌ ‌వ్యవస్థీకరణ బిల్లులో స్పష్టంగా ఉందని, కృష్ణానదీ పరివాహక ప్రాంతాల అవసరాలు తీరందే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే హక్కు ఆంధ్రకు ఎవరిచ్చారని మంత్రి హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. కృష్ణాజలాలపై ఎపికి 512 టిఎంసిల వాటా ఎక్కడిదని ఆయన నిలదీశారు. పోతిరెడ్డిపాడుకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ 44 ‌వేల క్యూసెక్కుల నీటిని తరలించినప్పుడే నిరసనగా టిఆర్‌ఎస్‌ ‌శాసనసభ్యులం రాజీనామాలు చేశామన్నారు.

ఇప్పుడు రోజుకు 3టిఎంసి తరలిస్తామంటే తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. కొత్తగా నీటిని వినియోగంలోకి తీసుకురావాలం టే అపెక్స్ ‌కమిటీలో చర్చించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి చర్చలు లేకుండా అక్రమంగా శ్రీశైలం నుంచి ఆంధ్ర రోజుకు 80వేల క్యూసెక్కుల నీటి ని తరలించుకుపోతే తెలంగాణలోని కృష్ణాపరివాహక ప్రాంతాల పరిస్థితి ఏమిటీ, కృష్ణానదీపై ఆధారపడిన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటని ఆయన ఆంధ్రను ప్రశ్నించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Leave a Reply