Take a fresh look at your lifestyle.

ఆం‌ధ్ర నీటి దోపిడీని అడ్డుకుని…

  • కృష్ణా నదిలో తెలంగాణ వాటాను కాపాడుకుందాం
  • ఏపీ ప్రభుత్వం జీవో 203ని ఉపసంహరించుకోవాలి
  • టీజేఎస్‌ ‌నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం డిమాండ్

‌పోతిరెడ్డిపాడును విస్తరించి సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేస్తే శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అయిపోతుందనీ, దీంతో తెలంగాణకు కృష్ణా నదీ జలాల వాటాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడింది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి,నల్గొండ, మహబూబ్‌నగర్‌, ‌ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారతాయని ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం టీజేఎస్‌ ‌నేతృత్వంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పోతిరెడ్డిపాడుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అధ్యక్షత వహించగా, సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, న్యూడెమోక్రసీ నేతలు కె.సూర్యం, అచ్యుత రామారావు, సిపీఎం నేత సార మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, టీడీపీ నేత నల్లెల కిషోర్‌, ఇం‌టిపార్టీ నేత సందీప్‌ ‌చమార్‌ ‌పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోదండరామ్‌ ‌మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచిన పక్షంలో తెలంగాణ కృష్ణా నదిలో తన వాటాను శాశ్వతంగా కోల్పోతుందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203ను వెంటనే ఉపసంహరించుకోవాలనీ, తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ ‌చేశారు. కృష్ణా నదిపై పెండిండ్‌ ‌ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనీ, జూరాలపై మరొక ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. ఈనెల 15న పూర్వపు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నల్గొండ, ఖమ్మం జిల్లాలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పై డిమాండ్ల సాధనకు జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌ ‌చేశారు. ఈ డిమాండ్ల సాధనకై పార్టీలు ప్రజా సంఘాలు ఏకోన్ముఖంగా కదలాలనీ, తెలంగాణ ప్రజలు కూడా నీటిపై తమ హక్కుల సాధనకు కదలాలని అఖిలపక్ష సమావేశంలో నేతలు డిమాండ్‌ ‌చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply