Take a fresh look at your lifestyle.

మౌలానా ఆజాద్‌ను గుర్తు చేసుకోవాలి

పౌరసత్వం చర్చకొచ్చిన ఈ శకంలో ఆనాడు లౌకికత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన..మౌలానా ఆజాద్‌ను గుర్తు చేసుకోవాలి…పాకిస్తాన్‌ను వ్యతిరేకిస్తున్న ముస్లింలు భారత్‌కు విధేయతగా ఉంటూ భారత ప్రయోజనాల కోసం పాటు పడాలన్న ఆయన సందేశం ఇప్పటికీ అక్కడ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మ ఇప్పటికీ నీడలా వెంటాడుతూనే ఉంటుంది. అందువల్ల ముస్లింలంతా భారత వ్యతిరేకులు కాదు. అందుకు ఉదాహణ మౌలానా ఆజాద్‌ ‌జీవితమే. ఆనాడు ఆయన ప్రవచించిన లౌకిక వాదం భారత సెక్యులరిజానికి ఇప్పటికీ వెన్నెముకగా ఉంది. 

Moulana azaad

1959లో ఒక కార్టూనిస్టు ఒక నాయకుణ్ణి గూని వానిగా ఎందుకు చూపించాడు. ఆ కార్డూనిస్టు ఆ నాయకుణ్ణి ఎందుకు ఇలా గూనివానిగా చూపించాడని ఆశ్చర్య పోయాను. ఈ కార్టూన్‌ను 1959లో ఒక ఉర్దూ మ్యాగజైన్‌లో ప్రచురించారు. ఆ మ్యాగజైన్‌ ‌పేరు నుఖూష్‌. ఈ ‌కార్డున్‌ను వేసింది ప్రముఖ ఇర్షాద్‌ ‌హైదర్‌ ‌జైదీ. గూనివానిగా ఉన్న ఆ నాయకుడు ఎవరో కాదు..మాజీ కేంద్ర మంత్రి మౌలానా అబుల్‌ ‌కలామ్‌ ఆజాద్‌. 1948‌లోని జుమ్మా మసీదులో కలామ్‌ ‌చాలా కోపంతో చేసిన ప్రసంగం వివరాలతో పాటు ఆ కార్టూన్‌ను ఆ పత్రికలో ప్రచురించారు. ఆయన ఆగ్రహానికి కారణం దేశ విభజన. ఆయన ముస్లింలను ఉద్దేశించి ‘నా వెన్ను విరిచారురా’ అని అన్నారు. ‘నా నాలుక కోసేసారు, నా చేతులు కోసేశారు నేను ముందుడుగు వేయాలనుకున్నాను, నా కాళ్ళు నరికేశారు. వెనుతిరుగుదామనుకున్నాను, నా వెన్ను విరిచేశారు. నేను నా మాతృభూమిలోనే దిక్కులేని వాడినయ్యాను. అయితే, నేను నేను వారి వలలో పడ్డానని అనుకోవద్దు. నాకు ఈ గూడులో స్థానం లేదని భావిస్తున్నాను. నా గుండె బరువుగా ఉంది.’ అన్న ఆయన మాటలు ఢిల్లీ పోలీసులు జామియా మిలియా ఇస్లామియా ఆవరణలోకి దూసుకుని వొచ్చిన వారం రోజుల తర్వాత ఆ ప్రదేశం అంతా నిర్జనంగా ఉన్నప్పుడు గుర్తొచ్చాయి. అంతా ఖాళీ అవుతోంది. జాకీర్‌ ‌హుస్సేన్‌ ‌గ్రంథాలయంలో ఆవరణ రక్త సిక్తమై ఉంది, అక్కడే నేను ఆరు నెలలు ఉన్నాను. మౌలానా ఆజాద్‌ ‌స్వాతంత్య్రోద్యమంలో కార్యకలాపాలకు అదే ఆటపట్టుగా ఉండేది. ఆజాద్‌ ‌స్వతంత్ర భారత దేశానికి తొలి విద్యా మంత్రి. 1920లో ఆయన జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపక కమిటీకి ఎన్నికయ్యారు. 1931లో ధర్సన సత్యాగ్రహ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. ఆజాద్‌ అప్పట్లో హిందూ, ముస్లిం ఐక్యత కోసం విశేషంగా కృషి చేశారు. భారత దేశపు లౌకిక వ్యవస్థ పునాదులు గట్టిపడేందుకు కృషి చేశారు. ఆయనను మహ్మదాలీ జిన్నా కాంగ్రెస్‌ ‌షో బోయ్‌ అని వెటకారంగా పిలిచేవారు. తనపై ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన ఎన్నడూ లేక్క చేయలేదు. హిందూ ముస్లిం ఐక్యత కోసం కృషి చేసారు. 1940లో ఆయన చేసిన ఒక ప్రసంగంలో ‘నేను భారతీయుడునని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని అన్నారు. భారత జాతీయతలో భాగమైన అవిభాజ్యమైన ఐక్యత కోసం కృషి చేస్తున్న వ్యక్తిగా గర్విస్తున్నాను. నేను ఎవరికీ లొంగను. ఎవరికీ తలవంచను’ అనేవారు.

పౌరసత్వం చర్చకొచ్చిన ఈ శకంలో ఆనాడు లౌకికత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన..మౌలానా ఆజాద్‌ను గుర్తు చేసుకోవాలి

ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిని వారి ఆహార్యాన్ని బట్టి గుర్తించవచ్చని అన్నారు. అలాంటప్పుడు మౌలానా ఆజాద్‌, ‌జిన్నాల ఆహార్యం ఒకే తీరులో ఉండేది, వారిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉండేవారు. వారి వైఖరుల్లో ఎంత భిన్నత్వం ఉందో మరి. అందువల్ల మోడీ చెప్పినట్టు ఆహార్యం ఒకే రీతిలో ఉన్నంత మాత్రాన వారందరి భావాలూ ఒకే తీరుగా ఉండాలని లేదు. జిన్నా ముస్లింలకు ప్రత్యేక దేశం కోసం పోరాడి సాధించుకున్నారు. ఆజాద్‌ ‌స్వతంత్ర భారత తొలి విద్యా మంత్రిగా దేశంలో విద్యా వ్యాప్తికి ఎన్నో సేవలు అందించారు. ఆజాద్‌ 1888‌లో మక్కాలో జన్మించారు. మత పరమైన పండితుల కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు సయ్యిద్‌ ‌గులామ్‌ ‌ముహియుద్దీన్‌. ఆయన సయ్యద్‌ అహ్మద్‌ ‌ఖాన్‌, ‌షిబిలీ నోమానీ జమాలుద్ధీన్‌ ఆఫ్ఘనిల రచనలతో ప్రభావితం అయ్యారు. వారిది ఇస్లామిక్‌ ‌వాదం. దాంతో ఆజాద్‌ 1913‌లో ముస్లిం లీగ్‌లో చేరారు. 1920 వరకూ ఆ పార్టీలో కొనసాగారు. జమాత్‌ ఉల్‌ ఉలేమా ఏ హింద్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆయన అరబిక్‌, ‌పర్షియన్‌, ‌టర్కిష్‌ ‌భాషల్లో ప్రావీణ్యుడు. జర్నలిస్టు విలువలను ఆకళింపు చేసుకున్నారు. మొదట ఆయన అల్‌ ‌మిస్‌ ‌బాష్‌ అనే తొలి వార్తా పత్రికను ప్రారంభించారు. అప్పటికి ఆయన వయసు 12 సంవత్సరాలే. ఆజాద్‌ ‌మాస పత్రిక లిసన్‌ ఉస్‌ ‌సిధిక్‌(‌వాయిస్‌ ఆఫ్‌ ‌ట్రూత్‌) ‌ప్రాచుర్యాన్ని పొందింది. బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఆయన ప్రారంభించిన అల్‌ ‌హిలాల్‌నూ, అల్‌ ‌బాలాగ్‌నూ నిషేధించింది. దేశద్రోహ నేరం మోపింది. డిఫెన్స్ ఇం‌డియా చట్టం కింద బెంగాల్‌లో నివసించమని ప్రభుత్వం ఆదేశించింది. 1920లో రాంచీ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన జీవితం మలుపు తిరిగింది. ఖలీపత్‌ ఉద్యమ నాయకులతో కలిసి ఆయన మహాత్మాగాంధీని కలుసుకున్నారు. సాంస్కృతిక సామరస్యం జాతీయ సమైక్యత, స్వాతంత్య్ర భావాలను ఆయన పుణికి పుచ్చుకున్నారు. 1923లో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ‌ప్రత్యేక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. గాంధీజీ క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించడంతో ఆయనలో పెనుమార్పు వచ్చింది.

హిందూ ముస్లిం ఐక్యత కోసం ఆయన కృషి చేశారు. భారత దేశానికి స్వయంపాలక ప్రభుత్వం కావాలని అందరి కన్నా ఎలుగెత్తి చాటిన వాడు ఆజాద్‌. ఆయన దేశం కోసం ఎంతో పాటు పడ్డాడు. జమ్మా మసీదుపై డిసెంబర్‌ 20‌వ తేదీన జరిగిన దాడిలో చాలా మంది గాయపడ్డారు. దాడి చేసిన వారికి మౌలానా ఆజాద్‌ ‌వంటి వారు భారత స్వాతంత్య్రం కోసం ఎంత పాటు పడ్డారో తెలియకపోవచ్చు. జమ్మా మసీదు హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం. ఆజాద్‌ ఆనాడు సాగించిన సమైక్యతా ఉద్యమానికి కేంద్ర స్థానం. అక్కడ లౌకిక వాదం వ్యాప్తి కోసం మౌలానా ఆజాద్‌ ‌జరిపిన పోరాటం స్మృతులు ఇప్పటికీ లౌకికవాదులను అక్కడ వెంటాడుతూనే ఉంటాయి. పాకిస్తాన్‌ను వ్యతిరేకిస్తున్న ముస్లింలు భారత్‌కు విధేయతగా ఉంటూ భారత ప్రయోజనాల కోసం పాటు పడాలన్న ఆయన సందేశం ఇప్పటికీ అక్కడ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మ ఇప్పటికీ నీడలా వెంటాడుతూనే ఉంటుంది. అందువల్ల ముస్లింలంతా భారత వ్యతిరేకులు కాదు. అందుకు ఉదాహణ మౌలానా ఆజాద్‌ ‌జీవితమే. ఆనాడు ఆయన ప్రవచించిన లౌకిక వాదం భారత సెక్యులరిజానికి ఇప్పటికీ వెన్నెముకగా ఉంది.

Leave a Reply