- వైన్ షాప్ తెరవడంలో అత్యుత్సాహం వద్దు
- పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వలస కార్మికుల టికెట్లకు జగ్గారెడ్డి రూ.10 లక్షల విరా
కొరోనా సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం అయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు .మంగళవారం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందని దీనికి నీరసనగ గాంధీభవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క దీక్ష చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 5 గంటలకు ముగిసింది .ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియా తో మాట్లాడుతు ….సోనియాగాంధీ పిలుపుమేరకు వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి సహాయం చేస్తామని వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు చెల్లిస్తామని అన్నారు .పీఎం కేర్, సీఎం కేర్ కింద కోట్లు వసూలు చేస్తున్నారని అలాంటిది వలస కార్మికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించక పోవడం దుర్మార్గమన్నారు.ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోలేదు కాబట్టి మేము తీసుకున్నామని అన్నారు .వలస కార్మికుల లెక్కలు ప్రభుత్వం వద్ద లేకపోవడం సిగ్గుచేటన్నారు .
బస్తాలు, పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నారని తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 25లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందని మండిపడ్డారు.ప్రభుత్వం తమ సొంత పత్రికల్లో వైన్ షాప్ లు తెరవాలని రాశారని వైన్ షాప్ ల విషయం లో అత్యుత్సాహం వద్దని అన్నారు .లాక్ డౌన్ లో పేదలకు సహాయం 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ ప్రతిపక్షాలను తిట్టడం మీద పెట్టిన శ్రద్ధ పాలన మీద పెట్టడం లేదని విమర్శించారు.బత్తాయి రైతుల అవస్థలకు కేసీఆర్ వైఖరే కారణమని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు.దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ కోవిడ్ టెస్టులు జరుగుతున్నది మన రాష్ట్రంలోనేనని ఐసీఎంఆర్ అప్రూవ్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో టెస్టులకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు.గాంధీభవన్ లో జరిగిన దీక్ష లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు మాజీ సీఎల్పీ నేత జానా రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి .హెచ్, పొన్నం ప్రభాకర్, మర్రి శశిధర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్రం లోని అన్ని డీసీసీ కార్యాలయలో , కొందరు నేతలు సొంత ఇంట్లో నే దీక్ష లు చేశారు.
వలస కార్మికుల టిక్కెట్లకు విరాళాలు ఇచ్చిన నేతలు …
వలస కార్మికుల టికెట్ ల ఖర్చు కాంగ్రెస్ పార్టీ యే భరిస్తుందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటన నేపథ్యంలో గాంధీభవన్ లో జరిగిన దీక్ష లో ఎమ్మెల్యే జగ్గరెడ్డి తన వంతుగా 10 లక్షలు విరాళంగా ఇచ్చారు .మాజీ మంత్రి చంద్రశేఖర్ 2 లక్షలు ,విహెచ్ ,పొన్నం ప్రభాకర్ చెరో లక్ష రూపాయలు ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు .