Take a fresh look at your lifestyle.

దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి

కరోనా విపత్తులో టీఆర్‌ఎస్‌ ‌దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యాక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న బిజెపి బలాన్ని చూసి ఓర్వలేక మోడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రెస్‌మీట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని పొగుడుతూనే తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదని, టీఆర్‌ఎస్‌ ‌నేతలతో విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ‌సొంత పత్రిక, చానళ్లలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాస్తూ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడిపై నరేంద్ర మోది సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. కరోనా నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్‌ ‌కళ్యాణ యోజన ప్రకటించి లాక్‌డౌన్‌ ‌కాలంలో ప్రజలకు ఇబ్బంది కల్గకుండా 1.70లక్షల కోట్ల రూపాయల భారి ప్యాకేజీని ప్రకటించిందని గుర్తుచేశారు. మోది ప్రభుత్వం చేపట్టిన చర్యలతో తెలంగాణ సహ దేశంలోని అన్ని రాష్ట్రాలు •ప్రయోజం పొందుతున్నాయని అన్నారు. గరీబ్‌ ‌కళ్యాణ యోజన తెలంగాణకు 7వేల 151.8కోట్ల రూపాయల ప్రయోజం చేకూరిందని అన్నారు. కరోనా విపత్తులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రంగానికి కేంద్రం చేదోడుగా నిలించిందని, ఆహార భద్రత అంత్యోదయ పథకం క్రింద రాష్ట్రంలో 2.80కోట్ల మందికి తెల్లరేషన్‌ ‌కార్డు ద్వారా అదనంగా 5కిలోల బియ్యం మోది ప్రభుత్వం ఉచితంగా అందించినందని పేర్కొన్నారు.

ఇందుకు కేంద్రం వెచ్చించిన 1261.44 కోట్ల రూపాయలు రెగ్యూలర్‌ ‌రేషన్‌ ‌బియ్యం కిలోకు 29కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సీడి అందిస్తుందని వెల్లడించా రు. అదే విధంగా రాష్ట్రంలోని 87.50లక్షల కుటుంబాలకు నెలకు కిలో చొప్పున 3నెలల పాటు పప్పు ఉచితంగా ఇస్తుందని, 262.60 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు 34.82లక్షల బ్యాంకు ఖాతాల్లో, అలాగే 696కోట్లు, 52.60లక్షల మహిళల జన్‌దన్‌ ‌ఖాతాల్లో 500రూపాల చొప్పున జయ చేయడం జరిగిందని తెలిపారు. 789కోట్ల రూపాయలు 10.72లక్షల మంది ప్రధాన మంత్రి ఉజ్వల లబ్దిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు.

Leave a Reply