సాగు నీటి వనరుల అభివృద్దికి అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. వెలేరు మండల కేంద్రంలో ఊర చెరువు ఫీడర్ ఛానల్లో జంగిల్ కటింగ్ పూడిక తీత పనులను జలహితంలో భాగంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగునీటి వనరులను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలహితం కార్యక్రమాన్ని ఉపాధి హామీ పథకం అనుసంధానంతో శ్రీకారం చుట్టిన నేపథ్యంలో చెరువులను, కుంటలు, కాల్వలు పూడికతీత, జంగల్ కటింగ్, ఫీడర్ ఛానల్ నిర్మాణాలు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేవిధంగా ప్రజలు కృషి చేయలని కోరారు. ఇరిగేషన్ శాఖ అధికారులు అత్యవసరంగా కావాల్సిన పనుల ప్రాధాన్యతను గుర్తించిన నేపథ్యం అట్టి పనులలో ఉపాధి హామీ వెజి సీకర్స్ ఎక్కువ మంది పాల్గొనే విధంగా చర్యలు చేపట్టి మండలంలో అన్ని పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేతన చెల్లింపు ఆధారంగానే మెటీరియల్ కంపోనెట్ నిధులు మంజూరు అవుతాయని చెప్పారు.
ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలో కూలీల సంఖ్య పెంచాలని, జాబ్ కార్డు గల వారందరికీ ఉపాధి కల్పించే విధంగా షెల్ఫ్ అప్ వర్క్‌లో పనులను గుర్తించాలన్నారు. కూలీలకు కనీస వేతనం పొందే విధంగా పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కూలీలతో మాట్లాడుతూ ఒక్కొక్కరు కనీసం రూ.200పైగా వేతనం వచ్చే విధంగా పనులు చేయాలన్నారు. వ్యవసాయ పనులకు కూలీ ఎంత ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పనులకు పోయే ముందు ఉపాధి హామీ పని చేస్తే ఆదాయం పెరుగుతుందని సూచించారు. మండలంలో వేజి సీకర్ సంఖ్య పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ఏపిఓ, ఏంపిడిఓను ఆదేశించారు. కూలీల వేతనం పెరిగినప్పుడు మెటీరియల్ కంపోనెంట్ పెరుగుతుందని ఆదిశ గా ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట డిఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ సిఈఓ ప్రసూన రాణి, ఎంపీడీఓ రవీందర్ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.