ఖమ్మం,జూన్3, ప్రజాతంత్ర (ప్రతినిధి) : పట్టణాలు, పల్లెలు పరిశుభ్రత-పచ్చదనంతో ఉండేందుకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ,ఎమ్మెల్యే వెంకటవీర య్యలు అన్నారు. వేంసూరు మండలం భీమవరంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య తో కలిసి పారిశుధ్య పనులను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి ,వీధికి వెళ్ళి ఇంకుడు గుంతల నిర్మా ణాలను , మురుగు కాలువలను, ఇంట్లోని నీటి నిల్వలను తనికి చేసి ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామం లో మొక్కలను నాటారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఇంట్లో వినియోగించిన నీటితో పాటు వర్షపు నీరు కూడా నిల్వ లేకుండా ఉండాలని తద్వారా దోమల వ్యాప్తి ఉండదని, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోగల్గుతామని కలెక్టర్ అన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి ప్రధాన బాధ్యత తీసుకొని వార్డు మెంబర్లు, గ్రామ ప్రజల సహకారంతో ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండేలా పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టి వర్షాలు ప్రారంభం కాకముందే పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.
కరోనా నేపథ్యంలో గ్రామంలో ప్రజ లందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. గ్రామంలో మిషన్ భగీరథ మంచినీటి సరఫరాపై ఇంకనూ సల్లాలు భిగించని ఇండ్లకు వెంటనే నల్లాలు బిగించి నీటి సరఫరా చేయాలని ఆర్. డబ్ల్యూ.ఎస్ ఏ.ఈ.లను కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలం సీజన్లో త్రాగునీటిని వేడిచేసి చల్లార్చిన పిదపనే త్రాగాలని, తద్వారా సీజనల్ వ్యాధులు దరిచేరవన్నారు. అనంతరం లింగపాలెం హరితహారం నర్సరీలు కలెక్టర్ సందర్శించారు. ఇప్పటికే నర్సరీలో పెంచుతున్న మొక్కలు, గ్రామాల ప్రజలకు రైతులకు అవసరమైన మొక్కల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వేంసూరు తహశీల్దారు శకుంతల, ఎం.పి.డి.ఓ వీరేశం, గ్రామ సర్పం చ్ జి.మౌనిక, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల మండల, గ్రామ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.నాయక్, నాగండ్ల దీపక్చౌదరి,జావీద్, సలీం పాల్గొన్నారు.