Take a fresh look at your lifestyle.

అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మనమే గెలవాలి

గులాబీ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ ‌దిశానిర్దేశం
‌రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అన్ని కార్పొరేషన్‌, ‌మున్సిపాలిటీల ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవాలని ఆ పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ ‌దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఎన్నికలే కీలకమనీ, పార్టీ అభ్యర్థుల విజయానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కోవిడ్‌ ‌పాజిటివ్‌తో ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌ ‌మున్సిపల్‌, ‌కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగనున్న ప్రాంతాల నేతలతో టచ్‌లో ఉన్నారు. ఓవైపు, కొరోనాకు చికిత్స తీసుకుంటూనే మరోవైపు, పార్టీ అభ్యర్థులు, నేతలతో ఎన్నికల అంశాలను సమీక్షిస్తున్నారు. పార్టీ అంతగా బలం లేని స్థానాలలో విజయానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంపై ఎప్పటికప్పుడు ఇంచార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆరా తీశారు. ఈ నెల 30 మున్సిపల్‌, ‌కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఆయా ప్రాంతాల నేతలతో సీఎం కేసీఆర్‌ ‌ఫోన్‌లో సూచనలు ఇచ్చారు. ఎలాగైనా అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌ ‌ఖాతాలో పడాలని భావిస్తున్న సీఎం కేసీఆర్‌ అం‌దుకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు నేతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

Leave a Reply