Take a fresh look at your lifestyle.

మన నీళ్ల కోసం ఉద్యమించాలి..

పెండింగ్‌ ‌ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రం అప్పుల పాలైంది
శాశ్వత నీటి పరిష్కారం కోసం కేంద్రంపై వొత్తిడి తేవాలి
టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌
మన రాష్ట్రానికి మన ప్రాంతానికి రావాల్సిన నీటి కోసం మరోమారు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌ ‌పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్‌ ‌హాల్‌లో పొగ్రెసివ్‌ ‌తెలంగాణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆల్‌ ‌పార్టీ మీటింగ్‌ ‌నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిందని, మన నీళ్లు మనకు కావాలని కోట్లాడడం జరిగిందని గుర్తుచేశారు. పులిచింతల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ‌నీరు మనకు రావాలంటే ఎత్తిపోసుకోవాలని, ఆంధ్రాకు ఆ ఇబ్బంది లేదన్నారు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన కృష్ణ ప్రాజెక్ట్ ఏడేళ్లు గడుస్తున్న పూర్తి కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ ‌ప్రాజెక్ట్లను పూర్తి చేయడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మితిమీరిన ఖర్చు చేసి రాష్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. ఆ ప్రాజెక్ట్ ‌ద్వారా అన్ని జిల్లాలకు నీరు అందలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి విషయంలో కేంద్రంపై వొత్తిడి తేవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలం వరకు మన రాష్ట్రం 50 టీఎంసిలకు మించి నీటిని వాడుకోవడం లేదని, ఆంధప్రదేశ్‌ 150 ‌టీఎంసీలను వాడుకుంటుందన్నారు. జూరాల వద్ద చేపట్టాల్సిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను శ్రీశైలం వద్ద పెట్టి ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. జూరాల నుంచి నీటిని ఎత్తిపోయాలని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలో రూ.7కోట్లు ఖర్చు చేసి స్టడీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం కిందికి తీసుకుపోయి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయక పోవడంతో ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌, ‌రంగారెడ్డి జిల్లాలు ఏడారిగా మారిపోయాయన్నారు. రిజర్వాయర్లను సద్వినియోగం చేసుకోకుండా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కయి సాగు నీరు ప్రయోజనాలు నాశనం చేసిందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాయలసీమను సస్యశ్యామలం చేస్తాననడం నీటిని సమానంగా వాడుకుందామని చెప్పారని మనకు రావాల్సిన నీటి గురించి పట్టించుకోకుండా రాయలసీమ గురించి మాట్లాడటం ఏమిటని తప్పుపట్టారు. శ్రీశైలంను ఖాళీ చేసేందుకు ఆంధప్రదేశ్‌ ‌కుట్ర చేస్తుందని తెలిపారు. కేంద్రం నీటి కేటాయింపుల్లో జోక్యం చేసుకుని వివాదాన్ని పెద్దగా చేస్తుందన్నారు. కృష్ణా బోర్డు పరిధిలోకి అన్ని ప్రాజెక్టులను తీసుకొచ్చిందన్నారు. కృష్ణా బోర్డు నీటి పరిష్కారం కోసం ఏర్పడిందని, కాని సమస్యను పరిష్కారం చేసేందుకు ఏర్పడలేదని స్పష్టం చేశారు. దీని ద్వారా ఆంధ్రకు లాభం మనకు నష్టం జరుగుతుందని, దోపిడీని చట్టబద్ధం చేస్తుందని, బోర్డు తెలంగాణకు షాపంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వొత్తిడి తెచ్చి నీటి శాశ్వత పరిష్కారంకు కృషి చేయాలని జురాలనుంచి పాలమూరు ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌, ‌రంగారెడ్డి జిల్లాలకు నీరు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. మన నీటిని మనం అందుకోక పోవడం ఆగ్రహించాల్సిన విషయమని, నీటి విషయంలో పశ్చిమ తెలంగాణకు అన్యాయంపై పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. అఖిల పక్ష సమావేశం మాజీ ఎం.పి. కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి, పోగ్రెసివ్‌ ‌తెలంగాణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగింది. మాజీ మంత్రి ప్రసాద్‌ ‌కుమార్‌, ‌మాజీ ఎంఎల్‌ఏ. ‌రామ్మోహన్‌ ‌రెడ్డి, మాజీ ఎంఎల్‌సి. యాదవ రెడ్డి, సదానంద రెడ్డి, ఉప్పరి రమేష్‌, ‌సోమశేఖర్‌, ‌తెలంగాణ జన సమితి, నాగేశ్వర్‌ ‌తెలంగాణ జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ మల్లేష్‌, ‌మహిపాల్‌ ‌రత్నం సుధాకర్‌ ‌రెడ్డి, మహిపాల్‌ ‌రెడ్డి, రఘువీరా రెడ్డి, నర్సింలు, కమాల్‌ ‌రెడ్డి, రవీందర్‌, ‌శంకర్‌, ‌రవి శంకర్‌, ‌శ్రీనివాస్‌, ‌ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు పాల్గొన్నరు.

Leave a Reply