Take a fresh look at your lifestyle.

సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆదుకున్నాం

రెండేళ్లలో వెనక్కి చూడకుండా ముందుకు సాగుతున్నాం
పెట్టుబడి సాయం కింద రైతులకు రూ.17 వేల కోట్లు అందచేత
రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నాం
ఇందిరాగాంధీ స్టేడియంలో పతాకావిష్కరణ చేసిన సిఎం జగన్‌

‌విజయవాడ,ఆగస్ట్ 15 : ఇం‌దిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్య ్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి సీఎం జగన్‌ ‌గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శననను సీఎం తిలకించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య ్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త లక్ష్యాలను నిర్దేశిరచుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ అన్నారు. మహిళలు రాజకీయంగా మరింత సాధికారిత సాధించాలన్నారు. 26 నెలలుగా ప్రజారంజకమైన పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో బతికేందుకు సొంతిల్లు ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలో రూ.83వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చెప్పారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామన్నారు. రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామని తెలియజేశారు.

ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌ అం‌దిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌ ‌సున్నా వడ్డీ ద్వారా 61 లక్షల మందికి అండగా నిలిచామని జగన్‌ ‌చెప్పారు. ఇన్‌పుట్‌ ‌సబ్సిడీకి రూ.1,039 కోట్లు చెల్లించామని, పేద రైతులందరికీ నవరత్న పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30వేల శాశ్వత ఉద్యోగాలిచ్చామన్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అనేక మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. కార్పొరేట్‌ ‌పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నామని, ప్రతి ఒక్కరూ డిగ్రీ లేదా సాంకేతిక విద్య పొందాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జగనన్న గోరుముద్ద ద్వారా 36 లక్షల మందికి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ ‌సిలబస్‌ ‌ప్రవేశపెడుతున్నామని అన్నారు. పిల్లల చదువులకు ఇప్పటి వరకు రూ.26వేల కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13 వేల కోట్లు ఇచ్చామని సీఎం జగన్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply