Take a fresh look at your lifestyle.

విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చాం: సిఎం జగన్‌ ‌

  • రైతులకు అండగా అనేక కార్యక్రమాలు అమలు
  • అసెంబ్లీలో సిఎం జగన్‌ ‌వెల్లడి

అమరావతి : విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చామని సీఎం జగన్‌ ‌ప్రకటించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నాలుగు బిల్డింగ్‌లు కనిపిస్తే అది అభివృద్ధి కాదు.. నిన్నటి కంటే ఈరోజు బాగుంటే అదే అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 62శాతం జనాభా వ్యవసాయంపై బతుకుతున్నారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం అన్నారు. రైతులకు కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. పంచాయతీ భవనాలపై నీలం- ఆకుపచ్చ రంగుల్ని.. కుట్రలు పన్ని తుడిచేశారు కానీ జనం గుండెల్లో తీసేయలేక పోయారని జగన్‌ ‌పేర్కొన్నారు.మనం నాలుగు బిల్డింగ్‌లు కడితే అభివృద్ధి జరిగినట్లు కాదు. నిన్నటికంటే ఈరోజు బాగుండాలి.

రేపు మరింత బాగుంటుందనే భరోసా కల్పించాలి. నాడు-నేడు ద్వారా విద్యావ్యవస్థ రూపురేఖలు మారుస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళా సాధికారతపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో 62 శాతంమంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వారి బతుకులు మార్చకుండా అభివృద్ధి ఎలా సాధ్యం. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు రైతులకు తోడుగా ఉంటున్నామని వివరించారు. కుట్రలు పన్ని గోడలపై ఉన్న రంగులు తుడిచివేయగలిగారు గానీ.. ప్రజల గుండెల్లో రంగులను తాకలేకపోయారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌, ‌తిరుపతి ఉపఎన్నిక సహాఏ ఎన్నిక వచ్చినా దేవుడి దయతో ఒకే జెండా ఎగిరింది. గత 23 నెలల్లో ప్రజలకు నేరుగా రూ.93,708 కోట్లు అందించాం. రూ.31,714 కోట్లు ప్రజలకు పరోక్షంగా అందించాం. మొత్తం రూ.లక్షా 25 వేలకోట్లు ప్రజలకు చేరవేశాం. మనం ప్రజలకు సేవకులమని గుర్తుపెట్టుకుని పనిచేయాలని సీఎం జగన్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply